అమరావతిలో ఇలా జరుగుతుందని ఊహించారా?!
దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కాగ్ కార్యాలయ భవనం అమరావతిలో నిర్మిం చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.
By: Garuda Media | 11 Dec 2025 3:44 PM ISTఏపీ రాజధాని అమరావతి.. ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంది. కార్యక్రమాలు ప్రారంభం అయినా.. రైతుల భూముల వ్యవహారాలు వచ్చినా.. అమరావతి పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో గడిచిన ఐదేళ్లు కూడా.. అమరావతి అతి పెద్ద టాపిక్. ఇక్కడి రైతులు చేసిన ఉద్యమాలు.. ప్రభుత్వ అణిచివేతలు వంటివి పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. ఇక కూటమి వచ్చిన తర్వాత.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కూడా చర్చనీయాంశం అయింది.
రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే.. వరుస పెట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. అతి పెద్ద సంస్థలు కూడా ఇక్కడ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నం మరో ఎత్తు. ఇప్పటికే ఆర్బీఐ సహా ఎస్బీఐ వంటి కీలక బ్యాంకులు ప్రధాన శాఖలను ఏర్పాటు చేసేందుకు భూమి పూజ కూడా నిర్వహించాయి. ఆయా నిర్మాణాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ఇక, తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) శాఖ కార్యాలయానికి ముందుకు వచ్చింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కాగ్ కార్యాలయ భవనం అమరావతిలో నిర్మిం చేందుకు కేంద్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర సర్కారు 2 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చేపట్టనుంది. దీని రాకతో.. అమరావతికి కేంద్రం నుంచి మద్దతు లభించడంతోపాటు.. ఇక, పూర్తిస్థాయి రాజధానిగా అమరావతి సాకారం కానుంది.
నిజానికి వైసీపీ హయాంలో మూడు రాజధానులు అన్నప్పుడు .. కేంద్రం కూడా బిత్తరపోయింది. అయితే.. అప్పటికి అమరావతి నోటిఫై కాకపోవడం.. వైసీపీ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో కేంద్రం మౌనంగా ఉంది. కానీ.. ఇప్పుడు కూటమి సర్కారు రెండు చోట్లా ఉండడంతో అమరావతి రాజధానికి ప్రాధాన్యం పెరిగింది. దీంతో ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుని అటు నిధులు.. ఇటు సంస్థలు కూడా.. అమరావతికి క్యూ కడుతున్నాయి.
