Begin typing your search above and press return to search.

ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!

అధిక ఆహార ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2023 4:42 AM GMT
ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం!
X

అధిక ఆహార ద్రవ్యోల్బణం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే బాస్మాతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు తాజాగా ఉప్పుడు బియ్యం (పారా బాయిల్డ్ రైస్) ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకుంది!

అవును... ఇప్పటికే బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం... మరోపక్క చక్కెర ఎగుమతులపై కూడా నిషేధం విధించబోతోందంటూ కథనాలు వస్తున్న తరుణంలో... తాజాగా ఉప్పుడు బియ్యం ఎగుమతుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎగుమతులపై 20 శాతం సుంకాన్ని విధించింది.

దీనిపై ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎగుమతి సుంకం ఆగస్టు 25 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అక్టోబర్‌ 16 వరకు ఉంటుందని నోటిఫికేషన్‌ లో పేర్కొంది. ayitE ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన పార్‌ బాయిల్డ్‌ రైస్‌ కు ఈ సుంకం వర్తించదని ఆర్ధిక శాఖ తెలిపింది.

భారత్ బాస్మాతియేతర బియ్యం ఎగుమతిపై బ్యాన్ విధించడంతో ఉప్పుడు బియ్యానికి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఉప్పుడు బియ్యం ధరలు కూడా భారీగా పెరగడం ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార, వ్యవసాయ సంస్థ బియ్యం ధరల సూచిక ప్రకారం ప్రపంచ ధరలను 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది.

దేశీయ రిటైల్‌ మార్కెట్‌ లో ఈ సంవత్సర కాలంలో బియ్యం ధరలు 11.5 శాతం పెరిగాయి. ఈ సంవతసరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య మన దేశం నుంచి 15.54 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు జరిగాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఎగుమతులు 11.55 లక్షల టన్నులుగా ఉన్నాయి.

అందుకే ఈ ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్రం సుంకాన్ని విధించింది. ఫలితంగా కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయంతో దేశీయంగా ఉప్పుడు బియ్యం ధరలు తగ్గే అవకాశం ఉంది.

కాగా... జూలై 20న బస్మాతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఉల్లిగడ్డ ధరలు అదుపులో ఉంచేందుకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా... ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధిస్తోంది.