Begin typing your search above and press return to search.

సీలింగ్ ఫ్యాన్ 'స్టార్' రేటింగ్ పెరిగే కొద్దీ ఇంత లాభమా?

సీలింగ్ ఫ్యాన్లను షాపుల్లో అమ్మే వారు కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్ కు తగ్గట్లుగా ఉండాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 6:30 AM GMT
సీలింగ్ ఫ్యాన్ స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ ఇంత లాభమా?
X

ఇంట్లో ఉపయోగించే సీలింగ్ ఫ్యాన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తాము పేర్కొన్నట్లుగా సీలింగ్ ఫ్యాన్ల ఉత్పత్తి సాగాలని చెప్పింది. తాజాగా డిసైడ్ చేసిన ప్రమాణాలతో కలిగే ప్రయోజనం గురించి తెలిస్తే.. సీలింగ్ ఫ్యాన్లు కొనే వేళలో.. స్టార్ రేటింగ్ తో కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇట్టే అర్థమవుతాయి. స్టార్ రేటింగ్ పెరిగే కొద్దీ.. సీలింగ్ ఫ్యాన్లో ఏం పెరుగుతుందన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది.

సీలింగ్ ఫ్యాన్లను షాపుల్లో అమ్మే వారు కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన గైడ్ లైన్స్ కు తగ్గట్లుగా ఉండాల్సి ఉంటుంది. సాధారణంగా 600మి.మీ.ల నుంచి 750 మి.మీ.ల సైజులో ఉండే ఫ్యాన్ కు సింగిల్ స్టార్ రేటింగ్ ఇస్తే దాని నుంచి నిమిషానికి 1.5 నుంచి 2 క్యూబిక్ మీటర్ల గాలి వెలువడాల్సి ఉంటుంది. అదే.. టూ స్టార్లు ఇస్తే సదరు ఫ్యాన్ 2 నుంచి 2.5 క్యూబిక్ మీటర్ల గాలిని వెలువడేలా ఉండాలి.

ఇక.. త్రీ స్టార్ రేటింగ్ తో లబించే సీలింగ్ ఫ్యాన్లకు 2.5 క్యూ.మీ. నుంచి 3 క్యూ.మీలు.. 4 స్టార్లకు అయితే 3 నుంచి 3.5, అదే ఫైవ్ స్టార్ రేటింగ్ ఫ్యాన్ అయితే 3.5 క్యూబిక్ మీటర్లకు మించి గాలి రావాలి. అదే 750నుంచి 1050మి.మీ.ల సైజులో ఉండే ఫ్యాన్లకు మాత్రం సింగిల్ స్టార్ తో 3.1-3.6 క్యూ.మీ. గాలి వెలువడాలి. ఈ మోడల్ లో ఒక్కో స్టార్ పెరిగే కొద్దీ 0.6 క్యూ.మీ. అదనపు గాలి నిమిషానికి వెలువడాల్సి ఉంటుంది. ఈ ప్రమాణామాలు వచ్చే డిసెంబరు 31 వరకు ఉంటుంది. అనంతరం మరోసారి రివ్యూ చేసి.. అవసరానికి అనుగుణంగా కొత్త ప్రమాణాల్ని నిర్దేసిస్తారని చెబుతున్నారు. సో.. సీలింగ్ ఫ్యాన్ కొనే ముందు స్టార్ల ఎంపిక చాలా అవసరం. స్టార్లు పెరిగే కొద్దీ గాలి ఎంత పెరుగుతుందన్న విషయం తాజా మార్గదర్శకాలతో అర్థమయ్యే పరిస్థితి.