Begin typing your search above and press return to search.

ధర మంటతో వెల్లుల్లి పంటకు సీసీ కెమేరా కాపలా

కాపలా కోసం సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 4:02 AM GMT
ధర మంటతో వెల్లుల్లి పంటకు సీసీ కెమేరా కాపలా
X

మూడో కన్నుగా మారిన సీసీ కెమేరాలను ఇప్పటివరకు ఇళ్లకు.. షాపులకు.. ఏదైనా సంస్థల వద్ద ఏర్పాటు చేయటం చూశాం. కానీ.. ఇప్పుడు పొలాల వద్ద కూడా సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో కొన్ని పంటల్ని పండించే పొలాల వద్ద ముందస్తు జాగ్రత్తగా.. కాపలా కోసం సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది.

వెల్లుల్లి కేజీ ధర రూ.500 వరకు ఉండటంతో.. వాటిని పండించే పొలాల వద్ద పెద్ద ఎత్తున సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే నాణ్యమైన వెల్లుల్లి ధర భారీగా పెరిగింది. మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా మోహ్ ఖేడ్ ప్రాంతాల్లోని నాలుగైదు గ్రామాల్లో వెల్లుల్లి పంట చోరీలు ఎక్కువ అయ్యాయి. దీంతో.. వీటికి చెక్ పెట్టాలని అక్కడి రైతులు భావించారు.

అందుబాటులోకి వచ్చిన సాంకేతికత అసరాగా చేసుకొని తమ పొలాల్లో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేసుకున్నారు. సీసీ కెమేరాల ఏర్పాటు అనంతరం ఆ పోలాల్లో దొంగతనాలు తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ కెమేరాలకు విద్యుత్ అవసరం లేకుండా.. సోలార్ తో పని చేయటం వీటి ప్రత్యేకత. అంతేకాదు.. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే అలారం మోగుతుంది. అందరిని అలెర్టు చేసేందుకు సాయం చేస్తుంది. దీంతో.. ఎక్కువమంది రైతులు తమ పొలాల్లో సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేస్తున్నారు.