Begin typing your search above and press return to search.

జగన్ లాగే చంద్రబాబు కూడా.....డోంట్ డిస్టర్బ్ అంటూ...!

ఆయన ఒంటరిగా తన ఆఫీస్ గదిలో కూర్చుని ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఎంపీ సీట్ల విషయంలో పూర్తి స్థాయిలో మధింపు చేస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 2:30 AM GMT
జగన్ లాగే చంద్రబాబు కూడా.....డోంట్ డిస్టర్బ్ అంటూ...!
X

ప్రాంతీయ పార్టీలలో అధినేతలదే పెత్తనం. వారి మాటలే వేదం. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్లూ అవసరం లేదు. అయితే వైసీపీలో చూస్తే అంతా జగన్ సొంత నిర్ణయాలు ఆయన ఒక్కడే తీసుకుంటారు అని అంటారు. వైసీపీలో అయితే పార్టీలో వేదికలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీకి అత్యంత విధాన నిర్ణయ కేంద్రంగా పొలిట్ బ్యూరో ఉంది. అలాగే సీనియర్లతో కమిటీ స్క్రీనింగ్ కమిటీ అంటూ చంద్రబాబు చుట్టూ చాలానే ఉంటాయి.

కానీ ఈసారికి మాత్రం అలాంటివి ఏవీ కనిపించడంలేదు. అంతా చంద్రబాబే అన్న మాట టీడీపీలో వినిపిస్తోంది. ఆయన దగ్గర మొత్తం అందరి చిట్టా ఉంది. అలాగే వరసబెట్టి జరిపిస్తున్న సర్వే డేటా కంప్లీట్ గా ఉంది. కాబట్టి ఆయనే ఎవరు అభ్యర్ధి అన్నది డిసైడ్ చేస్తారు అని అంటున్నారు.

చంద్రబాబు కూడా హైదరాబాద్ లో ప్రస్తుతం తన నివాసంలో ఉంటున్నారు అని అంటున్నారు. ఆయన ఒంటరిగా తన ఆఫీస్ గదిలో కూర్చుని ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే ఎంపీ సీట్ల విషయంలో పూర్తి స్థాయిలో మధింపు చేస్తున్నారు అని అంటున్నారు. ఆయన వద్ద ప్రతీ నియోజకవర్గంలో ఆశావహులు మొత్తం ఉన్నారు. అలాగే అవతల వైసీపీ వైపు అభ్యర్ధులు ఎవరో కూడా బయటకు వచ్చింది.

ఈ రెండు చిట్టాలతో పాటు అక్కడ రాజకీయ సామాజిక పరిస్థితులు, గత ఎన్నికల్లో టీడీపీ పెర్ఫార్మెన్స్, అలాగే వైసీపీ ఓట్లు ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని మరీ ఆయన పూర్తి క్లారిటీతో అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నారని అంటున్నారు. ఆయన తనకున్న పూర్తి సమాచారం ఆధారంగా సర్వేల ఆధారంగానే అభ్యర్ధులు ఎవరు అయితే బాగుంటుంది అన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎంపిక చేస్తారు అని అంటున్నారు.

కనీసం రెండవ కంటికి తెలియకుండా ఆయన ఈ కసరత్తు చేస్తున్నారు అని అంటున్నారు. గత ఎన్నికల వరకూ చూస్తే సీనియర్ల సలహాలను తీసుకున్నారు, కొన్ని అభిప్రాయాలను వారితో పంచుకున్నారు. కానీ ఈసారి మాత్రం బాబు ఎవరికీ ఏ విషయం లీక్ చేయడం లేదు. దాని వల్ల వారి నుంచి ఏమైనా మ్యాటర్ ఆశావహులకు వెళ్లి అక్కడ నుంచి కొత్త సమస్యలు వస్తాయని కూడా భావిస్తున్నారుట.

నిజానికి చంద్రబాబు రాజకీయ అనుభవంలో చూస్తే ఇవి పదవ ఎన్నికలు. ఆయన ఉమ్మడి ఏపీలోనే మొత్తం 294 అసెంబ్లీ సీట్లు 42 ఎంపీ సీట్లకు కూడా అభ్యర్ధులను ఎంపిక చేసిన రికార్డు ఉంది. దాంతో చంద్రబాబు ఈసారి ఏ మాత్రం తడబాటు పడకుండా గెలుపు గుర్రాలని ఎంపిక చేసే పనిలో ఉన్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే మిత్ర పక్షం జనసేన అలాగే బీజేపీ కూడా పొత్తులకు వస్తే ఎలా అన్నది కూడా అన్నీ కూలంకషంగా ఆలోచించి మరీ బాబు జాబితాను ప్రిపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఎట్టి పరిస్థితులలో సాధ్యమైనంత త్వరలో మొదటి జాబితాను టీడీపీ నుంచి విడుదల చేయాలన్న పట్టుదలతో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు.

ఈసారి టీడీపీకి ఎన్నికలు జీవన్మరణ సమస్య. దాంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అన్నది కూడా బాబు పట్టుదలగా ఉంది. అందుకే పొరపాట్లకు ఏ మాత్రం చోటు ఇవ్వకుండా అన్ని విషయాలను గమనంలోకి తీసుకుని అభయ్ర్ధుల ఎంపికను చేపడుతున్నారని అంటున్నారు. సో జగన్ మాదిరిగానే బాబు కూడా ఒంటరిగానే అభ్యర్థుల సెలెక్షన్ చేస్తున్నారు సో ఎవరు ఏమిటి అన్నది అధినేతల కంటే ఎవరికీ తెలియదు కాబట్టి అటు జగన్ అయినా ఇటు బాబు అయినా గెలుపు గుర్రాలనే దింపుతారు అని భావించాల్సిందే.