Begin typing your search above and press return to search.

కో ఆర్డినేషన్ మీటింగ్ : చంద్రబాబు వస్తున్నారా...?

తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించి రెండవ కో ఆర్డినేషన్ మీటింగ్ కి డేట్ టైం ఫిక్స్ చేశారు. టీడీపీకి చెందిన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఈ మీటింగ్ ఈ నెల 9న జరగనుంది.

By:  Tupaki Desk   |   6 Nov 2023 5:00 PM IST
కో ఆర్డినేషన్ మీటింగ్ : చంద్రబాబు వస్తున్నారా...?
X

తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించి రెండవ కో ఆర్డినేషన్ మీటింగ్ కి డేట్ టైం ఫిక్స్ చేశారు. టీడీపీకి చెందిన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఈ మీటింగ్ ఈ నెల 9న జరగనుంది. తొలి మీటింగ్ రాజమండ్రిలో ఒక హొటెల్ లో గత నెలలో 23న సాగింది. ఈసారి రెండవ మీటింగ్ టీడీపీ ఆఫీసులోనే పెడుతున్నారు.

ఈ మీటింగుకు టీడీపీ జనసేనల వైపు నుంచి చెరి ఆరుగురు సభ్యులూ హాజరవుతారు అని అంటున్నారు. తొలి మీటింగ్ లో ఉమ్మడిగా కార్యాచరణ రూపిందించుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. రెండవ మీటింగ్ పూర్తిగా ఉమ్మడి మ్యానిఫేస్టోని రూపొందించడం మీద జరుగుతుంది అని అంటున్నారు.

అలాగే ఉమ్మడిగా ఏపీలో పోరాటం చేయాలని కూడా నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి. ప్రజా సమస్యలు వేటిని తీసుకుని జనంలోకి వెళ్ళాలి అన్న దాని మీదనే ఈ మీటింగులో చర్చిస్తారు అని అంటున్నారు. ఈ సమావేశానికి టీడీపీ తరఫున యనమల రామక్రిష్ణుడు పితాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు, పంచుమర్తి అనూరాధ తదితరులు హాజరవుతూంటే జనసేన తరఫున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇతర నేతలు వస్తారని అంటున్నారు.

అయితే ఈ కో ఆర్డినేషన్ మీటింగ్ కి డేట్ ఫిక్స్ చేయడంలోనే కొంత ఆసక్తి కనిపిస్తోంది. చంద్రబాబు కోసమే అన్నట్లుగా ఈ డేట్ ఉందని అంటున్నారు. చంద్రబాబు ఈ మీటింగుకు రావాలీ అంటే ఇపుడున్న కోర్టు షరతుల నేపధ్యంలో కుదరదు. అయితే ఈ నెల 8న సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ మీద తీర్పు వెలువడనుంది. వాడిగా వేడిగా క్వాష్ పిటిషన్ మీద ప్రభుత్వ పక్షం తో పాటు టీడీపీ తరఫున న్యాయవాదులు వాదించారు. ఆ మీదట ఈ తీర్పు రిజర్వ్ చేశారు.

మరి చంద్రబాబు తన అరెస్ట్ అక్రమం అని సెక్షన్ 17 ఏ తనకు వర్తిస్తుంది అని కోర్టు ముందు తన న్యాయవాదుల ద్వారా వాదించారు. కోర్టు దీంతో ఎంతవరకూ ఏకీభవిస్తుంది అన్నది చూడాలి. టీడీపీ వరకూ చూస్తే క్వాష్ పిటిషన్ మీద కోటి ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు. క్వాష్ పిటిషన్ని ఆమోదిస్తారని భావిస్తొంది.

అదే కనుక జరిగితే బాబు మీద ప్రస్తుతం పెట్టిన ఏ కేసూ చెల్లదు. ఎందుకంటే వేటికీ గవర్నర్ నుంచి అనుమతి అయితే తీసుకోలేదు. మరో వైపు చూస్తే బాబు ఫుల్ ఫ్రీ బర్డ్ అయిపోతారు. ఆయన తాను నిప్పుని అని గట్టిగా చెప్పుకోవడానికి వీలు అవుతుంది. తన మీద లేని కేసులను పెట్టి జైలులో యాభై రోజులకు పైగా ఉంచారని ఆయన జనంలోకి వచ్చి పెద్ద నోరు చేయవచ్చు. వైసీపీని ఊపిరాడకుండా చేయవచ్చు.

ఇవన్నీ జరగాలంటే క్వాష్ పిటిషన్ కి అనుకూలంగా తీర్పు రావాలి. మరి అదే జరిగితే మాత్రం ఆ మరుసటి రోజే చంద్రబాబు పూర్వపు వైభవంతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వస్తారు జనసేన టీడీపీ కో ఆర్డినేషన్ మీటింగులో ఆయన పాల్గొని రెండు పార్టీలకు దిశా నిర్దేశం చేస్తారు. అందుకే టీడీపీకి సెంటిమెంట్ గా అచ్చి వచ్చిన 9న ఈ మీటింగ్ ఫిక్స్ చేశారు అని అంటున్నరు. మరి నంబర్ నైన్ టీడీపీని ఆశలను నిలబెడుతుందా బాబు వస్తారా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.