Begin typing your search above and press return to search.

లోక్ సభలో బాబు అరెస్ట్ ఇష్యూ...: టీడీపీ వర్సెస్ వైసీపీ....!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. దాని మీద ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   18 Sep 2023 3:07 PM GMT
లోక్ సభలో బాబు అరెస్ట్ ఇష్యూ...:  టీడీపీ వర్సెస్ వైసీపీ....!
X

పాత పార్లమెంట్ లో చివరి రోజు గా సోమవారం గడచింది. ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగభరితమైన ఉపన్యాసం చేసారు 75 ఏళ్ల పార్లమెంట్ హౌజ్ లో ఎన్నో అనుభవాలు, తీపి జ్ఞాపకాలు, మధురమైన అనుభూతులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎందరో పార్లమెంట్ కి వచ్చారు, వారి సేవలు అందించారు అని ఒక బిగ్ నంబర్ కూడా చెప్పారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ చివరి రోజు హ్యాపీగా గత జ్ఞాపకాలను నెమరసుకునేలా గడపాలని బీజేపీ కోరుకుంది. అయినా కానీ విపక్షం నుంచి విమర్శలు వచ్చి పడ్డాయి. ఇదిలా ఉంటే ఏపీ నుంచి కూడా ఆ రెండు పార్టీలు పాత వైరాలను పాత పార్లమెంట్ లోనే లాస్ట్ డే కూడా వేస్ట్ చేయకుండా అలా పచ్చగా పచ్చిగా ఉంచాలని చేసిన ప్రయత్నం చేయడం విశేషం.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ని పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని టీడీపీ చెప్పుకొచ్చింది. దాని మీద ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. ఏపీలో ఎలాంటి నిబంధలను పద్ధతులు పాటించకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారని లోక్ సభలో ఆరోపించారు. బాబు నేరాన్ని ఈ రోజుకీ నిరూపించలేకపోతున్నారు అని కూడా అన్నారు.

మరో వైపు దానికి కౌంటర్ చేస్తూ వైసీపీకి చెందిన లోక్ సభ నాయకుడు మిధున్ రెడ్డి అయితే బాబు ఇన్నాళ్ళూ స్టేలతో తప్పించుకున్నారని, ఇపుడు ఈ కేసులో దొరికారని, అదంతా చట్టబద్ధంగా సాగుతోందని, ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని చెప్పారు.

అయితే గల్లా జయదేవ్ మాట్లాడుతున్నపుడు వైసీపీ ఎంపీ భరత్ పదే పదే అడ్డు తగిలారు. అలాగే మిధున్ రెడ్డి మాట్లాడుతున్నపుడు టీడీపీ ఎంపీలు అడ్డు తగిలారు. ఏపీలో విషయాలు పార్లమెంట్ లో పెట్టడమేంటి అందునా కోర్టులో ఉన్న ఇష్యూలో ఇలా చేయడమేంటి అని మిధున్ రెడ్డి అంటూంటే టీడీపీ ఎంపీలు గట్టిగానే సౌండ్ చేశారు.

దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న వారు లాస్ట్ డే, ఈ పాత భవనంలో, ఎందుకు వివాదాలు అంటూ చల్లబరచే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు. మొత్తానికి పాత పార్లమెంట్ లో చివరి రోజు కూడా వైసీపీ టీడీపీ డిష్యూ డిష్యూ అలా కంటిన్యూ అయింది అనే అంటున్నారు.ఎక్కడా అలవాట్లను తప్పకుండా తమ వివాదాని పార్లమెంట్ లో కొనసాగించారు అని సెటైర్లు అయితే పడుతున్నాయి.

ఇక చూస్తే సభలో ప్రధాని మోడీ లేరు, హోం మంత్రి లేరు, స్పీకర్ సీట్లో ఓం బిర్లా లేరు, ఆ టైం లో టీడీపీ ఎంపీలు చంద్రబాబు అరెస్ట్ ప్రస్తావించి మమ అనిపించారా అన్న చర్చ అయితే ఉంది. అయితే ఇది ఇంతటితో ఆగదని కొత్త పార్లమెంట్ భవనంలో కూడా ఇదే వివాదం కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి మంగళవారం ఏమి జరుగుతుందో.