Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు.. ఎందుకింత హాట్ టాపిక్ అంటే?

గతంలో ఈడీ విచారణకు హాజరైన ఆమె.. ఆ తర్వాత నుంచి తనకు వచ్చే నోటీసులకు విచారణకు హాజరు కాకుండా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 5:05 AM GMT
ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు.. ఎందుకింత హాట్ టాపిక్ అంటే?
X

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారాలపట్టికి అనుకోని షాక్ ఎదురైంది. తాజాగా ఆమె సీబీఐ నుంచి నోటీసులు అందుకున్నారు. ఈ నెల 16న తమ విచారణకు హాజరు కావాలంటూ పంపిన నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ మద్యం కేసులో ఆమెకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. గతంలో ఈడీ విచారణకు హాజరైన ఆమె.. ఆ తర్వాత నుంచి తనకు వచ్చే నోటీసులకు విచారణకు హాజరు కాకుండా ఉంటున్నారు. ఇలాంటివేళ ఈసారి సీబీఐ నుంచి నోటీసులు రావటం గమనార్హం.

ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి సర్కారు (ఆమ్ ఆద్మీ పార్టీ) తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని.. అమ్మకందార్లకు లబ్ధి చేకూరేలా విధానాన్ని రూపొందించారన్న ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. పెద్ద ఎత్తునడబ్బులు చేతులు మారినట్లుగా పేర్కొంది. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసునమోదు చేయటం తెలిసిందే.

సీబీఐకు సమాంతరంగా ఈడీ సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులోనే గత ఏడాది ఫిబ్రవరి 26న అప్పటి ఢిల్లీడిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జైల్లోనే ఉన్నారు. మధ్యలో పెరోల్ మీద బయటకు వచ్చినా.. అది తాత్కాలికమేనని చెప్పాలి.

ఇక.. ఎమ్మెల్సీ కవిత విషయానికి వస్తే ఆమె మద్యం అమ్మకాల్లో కీలకమైన సౌత్ కార్టల్ అంశాల్లో ఎమ్మెల్సీ కవిత కీలకంగా వ్యవహరించారన్న మాట బలంగా వినిపిస్తోంది. మద్యం వ్యాపారులతో కలిసి పలు మార్లు సమావేశాల్ని నిర్వహించటమే కాదు.. ఇదే పని మీద పలుమార్లు ఢిల్లీకి వెళ్లినట్లుగా సీబీఐ.. ఈడీ భావిస్తోంది. ఇదంతా ఒక ఎత్తుఅయితే.. విచారణకు ఈడీ నోటీసులు ఇవ్వగా.. మహిళల్ని ఇంట్లోనే విచారించొచ్చన్న చట్టంలోని వెసులుబాటును ఆమె వినియోగించుకున్నారు.

ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె కేసు విచారణ సాగుతోంది. అయితే ఈ కేసు విచారణ ఈ నెల 28న విచారణకు రానుంది. అయితే.. ఈ లోపే (ఫిబ్రవరి 26న) విచారణకు తమ వద్దకు హాజరు కావాలంటూ సీబీఐ తాజాగా తాఖీదుల్నిజారీ చేసింది. మరి.. ఈ పరిస్థితుల్లో సీబీఐ నోటీసులకు తగ్గట్లు ఢిల్లీలో జరిగే విచారణకు హాజరవుతారా? లేదంటే.. సుప్రీంలో తన పిటిషన్ పై విచారణ జరిగే వరకు వెళ్లకుండా ఆగుతారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.