Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డు అధికారిని అరెస్ట్ చేసిన CBI!

సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లంచం అడిగినందుకు గాను ప్రాంతీయ‌ సెన్సార్ బోర్డ్ వ్యక్తి బెంగళూరులోని మల్లేశ్వర ఎస్‌ఆర్‌వి స్టూడియోలో పట్టుబడ్డాడు.

By:  Tupaki Desk   |   30 Nov 2023 4:20 AM GMT
సెన్సార్ బోర్డు అధికారిని అరెస్ట్ చేసిన CBI!
X

సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లంచం అడిగినందుకు గాను ప్రాంతీయ‌ సెన్సార్ బోర్డ్ అధికాని బెంగళూరులోని మల్లేశ్వర ఎస్‌ఆర్‌వి స్టూడియోలో పట్టుబడ్డాడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి రూ. 12,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. చిత్రనిర్మాత టైగర్ నాగ్ త‌న చిత్రం `అడివి` సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో సుదీర్ఘ జాప్యాన్ని ఎదుర్కొన్నాడు. అధికారి స‌ర్టిఫికెట్ జారీ కోసం డబ్బు డిమాండ్ చేసాడు.

అడవి పేరుతో క‌న్న‌డ‌ చిత్రానికి దర్శకత్వం వహించి, నిర్మించిన టైగర్ నాగ్ అవసరమైన సర్టిఫికేట్ కోసం వారం రోజుల పోరాటం తర్వాత సెన్సార్ అధికారి దోపిడీ ప్రయత్నాలు, వేధింపుల గురించి CBIకి నివేదించారు. అధికారి వర్ధమాన చిత్ర నిర్మాతలను ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. టైగర్ నాగ్ ఫిర్యాదుపై స్పందించిన సిబిఐ నవంబర్ 28న సాయంత్రం 6 గంటలకు ఎస్‌ఆర్‌వి స్టూడియోలో దాడిని ప్రారంభించింది. పది మందికి పైగా అధికారులు సివిల్ దుస్తులు ధరించి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటన దాదాపు తొమ్మిదేళ్ల క్రితం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) CEO అయిన రాకేష్ కుమార్ 2014లో లంచం కోసం అరెస్టయిన నాటి ఎపిసోడ్ ని త‌ల‌పించింది. సినిమా క్లియరెన్స్‌ను వేగవంతం చేసేందుకు రూ.70,000 లంచం తీసుకున్నందుకు కుమార్‌ను అప్ప‌ట్లో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్‌లో ఏజెంట్ శ్రీపతి మిశ్రా - సెన్సార్ బోర్డ్ అడ్వైజరీ ప్యానెల్ సభ్యుడు సర్వేష్ జైస్వాల్ కూడా ఉన్నారు. వీరు అధికారి ఇంటిపై దాడి చేసిన సమయంలో అతని తరపున లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 2014లో ఈ అరెస్ట్ అంద‌రి దృష్టిని ఆకర్షించింది.