Begin typing your search above and press return to search.

హిజ్రాల‌కు కులం ఎందుకు?: సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఈ నేప‌థ్యంలో హిజ్రాల‌ను ప్ర‌త్యేక కులంగా ప‌రిగ‌ణించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను కొట్టి వేసింది.

By:  Tupaki Desk   |   17 Oct 2023 8:36 AM GMT
హిజ్రాల‌కు కులం ఎందుకు?:  సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X

ట్రాన్స్‌జెండ‌ర్లు, లేదా హిజ్రాల విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ హిజ్రాలు ఉన్నార‌ని.. అన్ని కులాల్లోనూ ఉన్నార‌ని.. ఫ‌లానా కులం వారే.. హిజ్రాలుగా మారుతున్నార‌నే ఆధారాలు ఎక్క‌డా లేవ‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో హిజ్రాల‌ను ప్ర‌త్యేక కులంగా ప‌రిగ‌ణించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌ను కొట్టి వేసింది.

"హిజ్రాలు ఇప్ప‌టికే వారి జ‌న్మ‌తః ఉన్న కులంలోనే ఉన్నారు. ఇప్పుడు వారికి ప్ర‌త్యేకంగా కులం ప్ర‌క‌టించ లేం. ఇలా చేయ‌లేము కూడా" అని సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం బిహార్‌లో కుల గ‌ణన జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సంబంధిత కుల గ‌ణ‌న‌కు చెందిన ఫాంలో స్త్రీ, పురుష‌, హిజ్రా కాల‌మ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఇదేస‌మ‌యంలో కులాల‌కు చెందిన కాల‌మ్ కూడా ఉంది.

ఈ నేప‌థ్యంలో హిజ్రాల‌ను ఏ కులంగా భావించాల‌నే సందేహం ఏర్ప‌డింది. దీంతో వారిని ప్ర‌త్యేక కులంగా భావించి.. న‌మోదు చేయాల‌ని బిహార్‌లోని నితీష్ కుమార్ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొంద‌రు హిజ్రాలు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

త‌మ‌కు ఇప్ప‌టికే కులాలు ఉన్నాయ‌ని.. త‌మ‌ను ప్ర‌త్యేక కులంగా చూడాల్సిన అవ‌స‌రం ఏముందని పిటిష‌న్‌లో ప్ర‌శ్నించారు. దీనిపై విచారించిన సుప్రీం కోర్టు.. పైవిధంగా వ్యాఖ్యానించింది.

ట్రాన్స్‌జెండ‌ర్లు లేదా హిజ్రాలకు కులం ఎందుక‌ని ప్ర‌శ్నించింది. వారు ఏ కులానికి చెందిన వారైనా.. వారిని థ‌ర్డ్ జెండ‌ర్లుగా భావించాల‌ని, ఈ విధంగా కుల గ‌ణ‌న‌లోనూ పేర్కొనాల‌ని సూచించింది. అదేవిధంగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను కూడా అందించాల‌ని పేర్కొంది. ట్రాన్స్‌జెండ‌ర్ అనేది ఎప్ప‌టికీ కులం కాబోద‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. స్త్రీ, పురుషుడు ఎలాగో.. ట్రాన్స్‌జెండ‌ర్ కూడా స‌మాజంలో అలానేన‌ని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.