Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు.. బీజేపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌!

ఈ కార్య‌క్ర‌మాన్ని ఆర్ ఎస్ ఎస్ నేతృత్వంలో మురుగ‌న్‌(కుమార స్వామి) భ‌క్త స‌మాజం వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోనే ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ.. నాస్తికుల‌పై వ్యాఖ్య‌లు చేశారు.

By:  Tupaki Desk   |   2 July 2025 7:45 PM IST
ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై క్రిమిన‌ల్ కేసు.. బీజేపీ స్ట్రాంగ్ రియాక్ష‌న్‌!
X

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై త‌మిళ‌నాడు పోలీసులు క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేశారు. బీఎన్ ఎస్ చ‌ట్టంలోని 196/1/A 299, 302, & 353/1/2 సెక్షన్ల కింద అన్నానగర్ పోలీసులు పవన్ కళ్యాణ్ స‌హా త‌మిళ‌నాడు బీజేపీ మాజీ చీఫ్‌ అన్నమలై పైనా కేసు పెట్టారు. అదేవిధంగా సదస్సు నిర్వా హకులపై కేసు నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని పోలీసులు పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

గ‌త నెల‌లో మ‌దురై జిల్లాలో `మురుగ‌న్ భ‌క్తుల మానాడు` నిర్వ‌హించారు. దీనికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఆహ్వా నించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆర్ ఎస్ ఎస్ నేతృత్వంలో మురుగ‌న్‌(కుమార స్వామి) భ‌క్త స‌మాజం వేడుక‌గా నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోనే ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ.. నాస్తికుల‌పై వ్యాఖ్య‌లు చేశారు. నాస్తికుల‌కు హిం దువుల‌ను, హిందూ దేవుళ్ల‌ను కామెంట్లు చేసే అర్హ‌త లేద‌న్నారు. హిందూ మ‌తాన్ని.. హిందూ దేవుళ్ల‌ను.. విమ‌ర్శించే సోకాల్డ్ లౌకిక‌వాద పార్టీలు.. దిగుమ‌తి చేసుకున్న మ‌తాల‌ను విమ‌ర్శించ గ‌ల‌రా? ఆద‌మ్ముందా? అని త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌కు స‌వాల్ రువ్వారు.

నాస్తికుల‌మ‌ని, లౌకిక వాదులమ‌ని చెప్పుకొంటూ..కొంద‌రు హిందూ మతంపై దాడి చేస్తున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఇలాంటి వారు ఎక్క‌డో అర‌బ్బు దేశాల నుంచి దిగుమ‌తి అయిన‌.. మ‌తాల‌ను, వారి దేవుడిని విమ‌ర్శించే ద‌మ్ముందా? అని నిల‌దీశారు. హిందువులు ఎల్ల‌ప్పుడూ.. స‌హ‌నంతో ఉంటార‌ని.. వారు స‌హ‌న‌మే పాటిస్తార‌ని ప‌వ‌న్ అన్నారు. వారంతా ఏక‌మై తే.. నాస్తికులు దేశం వ‌దిలి పోవాల్సిందేన‌ని ప‌రోక్షంగా సీఎం స్టాలిన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌లు కులాలు, మ‌తాల మ‌ధ్య మంట‌పెట్టేవిగా ఉన్నాయ‌ని పేర్కొంటూ.. అడ్వకేట్ వాంజినాతన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప‌వ‌న్‌పై కేసు న‌మోదు చేశారు. ఇదిలావుంటే.. బీజేపీ ఏపీ శాఖ ఇలా కేసు న‌మోదు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఏపీ బీజేపీ నూత‌న అద్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ మాట్లాడుతూ.. ఇది మురుగ‌న్‌పై పెట్టి కేసేన‌ని అభివ‌ర్ణించారు. పవన్ కల్యాణ్, బీజేపీ నేతలపై తమిళనాడులో కేసు పెట్టడం మురుగన్‌పై దాడిగా భావిస్తామన్నారు. రాబోయే తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఓటమి తథ్యమని చెప్పారు.