Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూస్తే వణుకే.. అక్కడున్నోళ్ల పరిస్థితేంటి?

కెనడాలోని ఒంటారియోలోని వండర్ ల్యాండ్ అమ్యూజ్ మెంట్ పార్కుకు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది.

By:  Tupaki Desk   |   26 Sep 2023 10:53 AM GMT
ఈ వీడియో చూస్తే వణుకే.. అక్కడున్నోళ్ల పరిస్థితేంటి?
X

వినోదం కోసం వెళ్లిన వారికి వణుకు పుట్టటమే కాదు.. బతుకు జీవుడా అంటూ బయట పడిన వైనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కెనడాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి చూస్తే.. వినోదం కోసం అమ్యుజ్ మెంట్ పార్కులకు వెళ్లే వారు ‘లాంబర్ జాక్ రైడ్’ ఎక్కేందుకు సంశయిస్తారని మాత్రం చెప్పక తప్పదు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

కెనడాలోని ఒంటారియోలోని వండర్ ల్యాండ్ అమ్యూజ్ మెంట్ పార్కుకు వెళ్లిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. రాత్రి 10 గంటలు దాటిన తర్వాత లాంబర్ జాక్ రైడ్ కోసం దాన్లో ఎక్కారు. భూమికి దాదాపు 70 అడుగుల ఎత్తులో ఉన్న చోట.. తల క్రిందులుగా వేలాడే వేళలో.. ఒక్కసారిగా ఈ మెషిన్ ఆగిపోయింది. దీంతో.. కిందకు రాలేక.. మామూలుగా ఉండలేక నరకయాతన పడ్డారు.

దాదాపు అరగంట పాటు ఈ నరకం సాగింది. జరిగిన పరిణామాన్ని అర్థం చేసుకొన్న సందర్శకులు.. అరుపులు.. కేకలు వేశారు. తమను రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. తలకిందులుగా అరగంట పాటు వేలాడుతూ ఉన్న వారంతా తాము ఎప్పటికి బయటకు వస్తామో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

దీంతో.. అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రైడ్ లో భాగంగా సందర్శకులు లాంబర్ జాక్ పైకి వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఆగిపోవటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉందని దీంతో అక్కడి వారంతా తమను రక్షించాలని కోరుకుంటూ కేకలు వేశారు.

అరగంట పాటు సాగిన ఈ హారర్ చివరకు అందరిని క్షేమంగా కిందికి దించారు. రాత్రి 11 గంటల వేళకు పరిస్థితులు కుదుటుపడ్డాయి. ఇందులో చిక్కుకున్న వారిలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. తాజా పరిణామం నేపథ్యంలో పార్కును కొన్ని రోజుల పాటు మూసివేయాలన్న నిర్ణయాన్ని యాజమాన్యం తీసుకుంది.