Begin typing your search above and press return to search.

మోసం చేయడమే డ్యూటీ... ఆ జాబ్ లో ఇరుకున్నవారిని రక్షించిన ప్రభుత్వం!

అవును... కంబోడియాలోని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న 250 మంది భారతీయ పౌరులను ప్రభుత్వం ఇప్పటివరకూ రక్షించింది

By:  Tupaki Desk   |   2 April 2024 1:30 AM GMT
మోసం చేయడమే డ్యూటీ... ఆ జాబ్ లో ఇరుకున్నవారిని రక్షించిన ప్రభుత్వం!
X

ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేయడం.. తమ దేశానికి రప్పించుకోవడం.. అనంతరం సైబర్ స్కాం స్కీములను ఆపరేట్ చేసేవారిగా మార్చడం ఇటీవల సర్వసాధారణమైపోయిందని అంటున్నారు. ప్రధానంగా... అగ్నేయాసియాలో జాబ్ స్కాం లను నడుపుతున్న మానవ అక్రమ రవాణా గ్యాంగులు ప్రపంచ వ్యాప్తంగా ఇలా లక్షలాది మందిని బలిచేస్తున్నారని అంచనావేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 250 మంది ఇండియన్స్ సేఫ్ గా వెనక్కి రాగలిగారు.

అవును... కంబోడియాలోని ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న 250 మంది భారతీయ పౌరులను ప్రభుత్వం ఇప్పటివరకూ రక్షించింది! ఈ సందర్భంగా స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ... ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి, చట్టవిరుద్ధమైన సైబర్ పనులకు వాడుతున్నారని తెలిపింది. ఈ సమయంలో బాధితుల్లో ఎక్కువగా యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో కంబోడియాలో చుక్కుకున్న 5,000 మందికి పైగా భారతీయులు సైబర్ స్కాంలను ఆపరేట్ చేయాల్సి వస్తుందని ఇటీవల పలు నివేదికలు చెబుతున్నాయని అంటున్నారు! ఇదే క్రమంలో మయన్మార్ లో 1,20,000 మంది.. కంబోడియాలో 1,00,000 మంది సైబర్ స్కాం స్కీంలను ఆపరేట్ చేయాల్సి వచ్చిందని ఐక్యరాజ్య సమితి తన 2023 నివేధికలో వెల్లడించింది. దీన్నిబట్టి తీవ్ర ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

తీవ్రత ఈ స్థాయిలో ఉండటంతో ఈ విషయాలపై స్పందించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్... ఈ మోసపూరిత కథకాలకు కారణమైన వారిని అణిచివేసేందుకు కంబోడియా అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు! ఈ క్రమంలోనే గత మూడు నెలల్లో సుమారు 75 మందిని రక్షించినట్లు తెలిపారు. ఇదే సమయంలో మిగిలినవారి విషయంలో స్పష్టమైన టైం లైన్ లేదని వెల్లడించారు.