Begin typing your search above and press return to search.

సెల్యూట్... అమెరికాలోని భారత సంతతి పోలీస్‌ కు అరుదైన గౌరవం!

అవును... అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక పోలీస్ అధికారి పేరును ఒక రహదారికి పెట్టింది అక్కడి ప్రభుత్వం

By:  Tupaki Desk   |   6 Sep 2023 7:00 AM GMT
సెల్యూట్... అమెరికాలోని భారత సంతతి పోలీస్‌ కు అరుదైన గౌరవం!
X

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన అందించిన సేవలకు గానూ ఒక రహదారికి ఆయన పేరును పెట్టి గౌరవించింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది. ఇదే సమయంలో ఆ పోలీస్ అధికారి ఎవరు.. ఇంత అరుదైన గౌరవం ఎందుకు ఇచ్చారు అనే సెర్చ్ ఆన్ లైన్ వేదికగా స్టార్ట్ అయ్యింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

అవును... అమెరికాలో భారత సంతతికి చెందిన ఒక పోలీస్ అధికారి పేరును ఒక రహదారికి పెట్టింది అక్కడి ప్రభుత్వం. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న వ్యక్తి పేరు రోనిల్‌ సింగ్‌! ఆయన న్యూమాన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ లో పోలీస్‌ అధికారిగా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయారు!!

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని కాలిఫోర్నియాలో రోనిల్‌ సింగ్‌ (34) అనే భారత సంతతి వ్యక్తి న్యూమాన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ లో పోలీస్‌ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇందులో భాగంగా 2018 డిసెంబర్‌ 26న క్రిస్మస్‌ రాత్రి ఓ రహదారి వద్ద గస్తీ డ్యూటీ చేస్తున్నారు. ఇంతలో దారుణం చోటు చేసుకుంది.

ఆ రాత్రి రోనిల్ సింగ్ ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి కారులో తాగుతూ వచ్చాడు. తాగుడు మైకంలో విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నాడు. దీంతో ఆ సమయంలో డ్యూటీలో ఉన్న రోనిల్ సింగ్ తూటాలకు బలయ్యారు.

ఈ దారుణ ఘటన అనంతరం విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఈ అధికారిని గౌరవించేలా, భావితరాలకు గుర్తుండేలా ఒక కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా ఒక రహదారికి అతని పేరు పెట్టి అంకితం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం ప్రొలాంగ్ అవుతూ వచ్చింది.

ఈ క్రమంలో తాజాగా ఆ నిర్ణయం అమలుకి నోచుకుంది. ఇందులో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్‌ మేరి అల్వరాడో గిల్‌, యూఎస్‌ ప్రతినిధి డువార్టే, అసెంబ్లీ సభ్యుడు జువాన్‌ అలానిస్‌ లు సెప్టెంబర్‌ 2న హైవే 33 స్టుహ్ర్‌ రోడ్‌ ‍ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఆ రహదారికి "కార్పోరల్‌ రోనిల్‌ సింగ్‌ మోమోరియల్‌ హైవే" అని నామకరణం చేశారు. భారీ సైన్‌ బోర్డు ఏర్పాటుచేశారు. దీంతో ఈ విషయం ఆన్ లైన్ వేదికగా వైరల్ అవుతుండగా... మరోసారి రోనిల్ సింగ్ ని తలచుకుంటున్నారు యూఎస్ జనాలు. ఆ బోర్డు ముందు ఫోటోలు దిగి మరోసారి రోనిల్ ని నివాళులు అరిపించారు కుటుంబ సభ్యులు!