Begin typing your search above and press return to search.

కాళేశ్వరంపై కాగ్ నివేదిక.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

ఈ క్రమ్మలో తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై "కాగ్" నివేదిక విడుదల చేసింది. దీంతో తీవ్ర సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   15 Feb 2024 9:10 AM GMT
కాళేశ్వరంపై కాగ్  నివేదిక.. వెలుగులోకి  షాకింగ్  విషయాలు!
X

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రధానంగా ఈ అంశం చుట్టునే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమ్మలో తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై "కాగ్" నివేదిక విడుదల చేసింది. దీంతో తీవ్ర సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా పెరిగిన అంచనా వ్యయంతో పాటు అప్పుపైనా కీలక విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... కాళేశ్వరం ప్రాజెక్టుపై "కాగ్" నివేదిక విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా... ప్రాజెక్టు డీపీఆర్ లో రూ. 63,352 కోట్లు చూపించగా... ఒక లక్షా ఆరు వేల కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సుమారు ఒక లక్షా 47 వేల 427 కోట్ల రూపాయలు (1,47,427 కోట్లు) ఖర్చు అవుతుందని స్పష్టం చేసింది.

ఇదే సమయంలో కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనంగా కలిగిన ప్రయోజనాలు ఏమీ లేవని.. ఒక్క విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 కోట్ల అదనపు వ్యయం పెరిగిందని వెల్లడించింది. ఇదే సమయంలో... రీ ఇంజినీరింగ్, మార్పుల వల్ల రూ.765 కోట్ల నష్టం వాటిల్లడంతోపాటు అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని తెలిపింది. ఇదే సమయంలో ప్రాజెక్టు నిర్వహాణ కోసం ప్రతీ ఏటా సుమారు 700 కోట్ల నుంచి 14,500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పింది.

2020 - 21లోనే రుణాల చెల్లింపు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... 9 ఆగ్రిమెంట్ లను వాయిదా వేయాలని కోరినట్టు చెప్పింది. వడ్డీలకు వడ్డీ 8,182 కోట్లు పెరిగిందని తెలిపింది. ఈ సమయంలో ప్రతి ఏటా 14,462 కోట్లు రుణాల చెల్లించాలని కాగ్ నివేదికలో చెప్పింది. ఈ లెక్కన చూసుకుంటే... కాళేశ్వరం అప్పు కట్టుకుంటూపోతే 2036వ సంవత్సరంలో పూర్తవుతుందని కాగ్ సంచలన విషయాలు వెల్లడించింది.

తెలంగాణలో ఇసుక తవ్వకాలపైనా కాగ్ అక్షింతలు!:

కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై విడుదలైన కాగ్ నివేదికలో తెలంగాణ ప్రభుత్వంపై కాగ్ అక్షింతలు వేసింది! ఇందులో భాగంగా గిరిజన సంఘాలకు పేరుకే ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఇచ్చారు కానీ... నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంట్రాక్టులు ఇతరులకు బదలాయించారని తెలిపింది. ఇదే సమయంలో... ఇసుక అక్రమాలను ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని.. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపింది. ఇదే సమయంలో... పర్యావరణ రక్షణ కోసం ఎలాంటి చర్యలు లేవని ఫైరయ్యింది.