Begin typing your search above and press return to search.

సీఎం దుబారా సరే.. ఆర్టీసీ ఇష్యూలో కాగ్ చెప్పిన లాస్ లెక్క సంగతేంటి జగన్?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు హెలికాఫ్టర్ వినియోగించటంపై తరచూ విమర్శలు చేస్తుంటారు.

By:  Garuda Media   |   7 March 2026 12:16 PM IST
సీఎం దుబారా సరే.. ఆర్టీసీ ఇష్యూలో కాగ్ చెప్పిన లాస్ లెక్క సంగతేంటి జగన్?
X

అందుకే అంటారు.. నీతులు చెప్పే ముందు.. ఎవరికి వారు వారి సంగతుల గురించి కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. గతం సంగతి వేరు. వర్తమానంలో ఓవైపు సోషల్ మీడియా.. మరోవైపు వాట్సాప్.. ఇంకో వైపు యూట్యూబ్ దెబ్బకు ఎక్కడెక్కడి సమాచారం మొత్తం సాక్ష్యాలతో సహా కళ్ల ముందుకు వచ్చేయటమే కాదు.. వెంటాడి వేధిస్తున్న వేళ.. అధినేతలు ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తరచూ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. తాను చెప్పే నీతలు..పొదుపు లెక్కలు తన మాటల్నివెక్కిరించే అవకాశాన్ని ఇవ్వకూడదన్న విషయాన్ని ఆయన సలహాదారులు జగన్ ను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.

ఇటీవల కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖర్చుల గురించి అదే పనిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. పనిలో పనిగా మంత్రి లోకేశ్ తో పాటు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విషయంలో ప్రత్యేక హెలికాప్టర్లను సొంతానికి వాడుకుంటున్నట్లుగా విమర్శలు చేయటం.. అందులో నిజం లేదని వారు కౌంటర్లు ఇవ్వటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు హెలికాఫ్టర్ వినియోగించటంపై తరచూ విమర్శలు చేస్తుంటారు.

తాజాగా కాగ్ తీసిన లెక్కల్లో తాము అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం.. పార్టీ కార్యక్రమాల కోసం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీని ఎంతలా వాడేశారో కళ్లకు కట్టేలా చెప్పిన లెక్క ఇప్పుడు షాకింగ్ గా మారింది. వైసీపీ పవర్ లో ఉన్నప్పుడు ఆ పార్టీ ప్లీనరీకి.. బీసీలకు నిర్వహించిన సభల కోసం పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్ని వినియోగించిన వైనాన్ని కాగ్ వెల్లడించింది.

ఈ కారణాలతో ఆర్టీసీ రూ.1.66 కోట్లు నష్టపోతే.. జీఎస్టీ వసూలు చేయని కారణంగా రూ.1.57 కోట్లు కోల్పోయిన వైనాన్ని కాగ్ రిపోర్టులో వెల్లడైంది. 2022 జులైలో గుంటూరు జల్లా నాగార్జున వర్సిటీ గ్రౌండ్ లో నిర్వహించిన పార్టీ ప్లీనరీకి ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఆరటీసీ బస్సుల్లో కార్యక్రమానికి తరలించారు. ఇందుకోసం మొత్తం 1823 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు.

నిబంధనల ప్రకారం ఈ బస్సులకు ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయాల్సి ఉండగా.. అధికారులు మాత్రం సాధారణ ఛార్జీలే వసూలు చేశారు. అంతేకాదు.. రూల్స్ కు భిన్నంగా పది శాతం రాయితీ ఇచ్చిన విషయాన్ని కాగ్ వెల్లడించింది. దీంతో ఆర్టీసీ సంస్థ రూ.75 లక్షలు నష్టపోవటమే కాదు.. ప్రత్యేక బస్సులపై వసూలు చేయాల్సిన 18 శాతం జీఎస్టీ వసూలు చేయని కారణంగా మరో రూ.72 లక్షల మేర నష్టపోయింది. అదే విధంగా 2022 డిసెంబరులో విజయవాడలో నిర్వహించిన నామినేటెడ్ ప్రతినిధుల బీసీ మహాసభకు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1439 బస్సులను తీసుకొని.. అప్పుడు కూడా ప్లీనరీ విధానాన్నే ఫాలో అయ్యారు. ఆ సందర్భంగా ఆర్టీసీకి రూ.91 లక్షలు.. జీఎస్టీ లేని కారణంగా మరో రూ.85 లక్షల నష్టం వాటిల్లింది. మొత్తంగా రెండు సందర్భాల్లో ఆర్టీసీకి రూ.1.66 కోట్లు.. ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ.1.57 కోట్లు నష్టపోయినట్లుగా కాగ్ పేర్కొంది.

తాము అధికారంలో ఉన్నప్పడు తమకునన పవర్ ను ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయేలా చేయటం కూడా తప్పే అవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ గురించి తరచూ మాట్లాడే జగన్.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తరహా నిర్ణయాల్ని ఎందుకు తీసుకుంటారు? అన్నది ప్రశ్న. తాముఅధికారంలో లేనప్పుడు ఆర్థిక క్రమశిక్షణ గురించి గుర్తుకు రావటం.. చంద్రబాబు విధానాల్ని ప్రశ్నించటం వరకుబాగానే ఉంటుంది. కానీ.. తాము కూడా తక్కువేమీ తినలేదన్న సత్యం వెలుగు చూసినప్పుడు మాత్రమే.. జగన్ మాటలకు.. చేతలకు పొంతన ఉండదన్న భావన కలుగుతుంది.