Begin typing your search above and press return to search.

బాబు పెద్ద బరువే మోస్తున్నారు

ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న వారు సి రామచంద్రయ్య. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశంతో ప్రారంభం అయింది. రాజ్యసభ మెంబర్ గా పనిచేశారు.

By:  Satya P   |   26 Feb 2026 10:00 AM IST
బాబు పెద్ద బరువే మోస్తున్నారు
X

ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ నాయకుడిగా ఉన్న వారు సి రామచంద్రయ్య. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశంతో ప్రారంభం అయింది. రాజ్యసభ మెంబర్ గా పనిచేశారు. ప్రజారాజ్యం లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు. వైసీపీలో చేరారు. ఎమ్మెల్సీ అయ్యారు. తిరిగి 2024లో టీడీపీలో చేరి ఎమ్మెల్సీ సీటుని అందుకున్నారు. అయితే గత ఇరవై నెలలుగా రామచంద్రయ్య అయితే సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే రాజకీయాల పట్ల విరక్తి అని అంటున్నారు.

బాబు మీద భారం :

ఏపీలో ముఖ్యమంత్రి పదవి అన్నది చాలా కష్టమైన వ్యవహారంగా సి రామచంద్రయ్య చెప్పారు. ఒక యూట్యూబ్ చానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ తాను సీఎం అయిన కొత్తల్లో బాబుని కలసి ఇదే మాట చెప్పాను అన్నారు. బాబు ముందు చాలా సవాళ్ళు ఉన్నాయని అన్నారు. బాబు ఒక వైపు ఏపీని దారిలో పెట్టాలని అలాగే నిధులు సమకూర్చుకోవాలని, మరో వైపు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాలని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరింతగా ఏపీకి సాయం ఇస్తూ చేయూతను ఇవ్వాలని ఆయన అన్నారు. బాబు నిజంగా చాలా కష్టపడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

పదిహేనేళ్ళు ఉండాల్సిందే :

ఏపీ గాడిన పడాలి అంటే పదిహేనేళ్ళ పాటు బాబు సీఎం గా ఉండాల్సిందే అని రామచంద్రయ్య అన్నారు. ఈ విషయంలో అంతా కలసి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ రోజున ఏపీలో అనేక ఇబ్బందులు ఉన్నాయని వాటిని అధిగమించి పనిచేయడం అంటే బాబుకే సాధ్యమని అన్నారు. ఈ విషయంలో మిత్ర పక్షం జనసేన కూడా సపోర్ట్ చేస్తోంది అని ఆయన చెప్పారు.

రాజకీయాలు వద్దు :

ఎమ్మెల్సీ పదవి కాలం ఆయనకు ముగియగానే రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నానని సి రామచంద్రయ్య చెబుతున్నారు. ఆయన కుమారుడిని రాజకీయాల్లో ప్రవేశపెట్టే ఆలోచన ఉందా అని చానల్ ఇంటర్వ్యూలో వేసిన ప్రశ్నకు ఆయన వద్దు ఈ రాజకీయాలు అని వైరాగ్య ధోరణి ప్రదర్శించారు. ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలని ఆ స్తోమత తమ కుటుంబానికి లేదని అన్నారు. పైగా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని తాము తట్టుకోలేమని కొనసాగలేమని తేల్చి చెప్పేశారు.

ప్రజాస్వామ్యం లేదు:

దేశంలో రాజకీయాలు బాగులేవని రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం కూడా గతంతో పోలిస్తే పెద్దగా లేదని అన్నారు. పార్లమెంట్ వేదికల మీద కూడా మాట్లాడనీయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్ళకుండా ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ప్రశ్నించాలని లేకపోతే వారు ప్రజలకు ద్రోహం చేసినట్లే అని ఆయన అన్నారు.