దీంత.. ఇరగదీశాడు.. టంగ్ స్లిప్ అయిన రైటర్..!
మంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కన్నప్ప. ఈ సినిమాను మోహన్ బాబు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
By: Tupaki Desk | 22 Jun 2025 1:49 AM ISTమంచు విష్ణు లీడ్ రోల్ లో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కన్నప్ప. ఈ సినిమాను మోహన్ బాబు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెషన్ లో జరిగింది. ఈవెంట్ లో సినిమాకు పనిచేసిన టీం అంతా అటెండ్ అయ్యారు. మంచు ఫ్యామిలీకి ఎంతో దగ్గరైన రైటర్ బి.వి.ఎస్ రవి కూడా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. ఈ ఈవెంట్ లో ఆయన స్పీచ్ ఆకట్టుకుంది. ఐతే సినిమాలో మంచు విష్ణు యాక్టింగ్ అదిరిపోతుందని ఫ్లోలో ఆయన దీం..తల్లి.. ఇరదీశాడు అనేశాడు.
బివిఎస్ రవి మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా మంచు విష్ణు చేస్తానటే ముందు భయపడ్డా.. బాధపడ్డా అదంతా అభిమానంతోనే.. రిస్క్ అవసరమా అనిపించింది. ఐతే అదేం కాదు బ్రహ్మాండంగా వస్తుందని ఇతరులు చెప్పారు. ఐతే సినిమా షూటింగ్ జరుగుతున్న టైం లో బ్రహ్మాజి చెప్పాడు.. వాటే ఫిల్మ్ వాటే షూటింగ్ అన్నాడు.. ఎక్స్ ట్రీం లీ గ్రేట్ ఫిల్మ్ అన్నాడు. అప్పుడు కాస్త నమ్మకం కలిగింది.
ఇక మోహన్ బాబు గారు ఫస్ట్ హాఫ్ చూపించారు.. ఫస్ట్ హాఫ్ చూడగానే ఒళ్లు జలదరించింది.. ప్రభాస్ ని చూడాలని కోరిక ఉంది సెకండ్ హాఫ్ కోసం ఎదురుచూశా.. ఈసారి మోహన్ బాబు గారితో కలిసి సినిమా చూశా చివరి 10 నిమిషాలు అద్భుతం.. సినిమా అయిపోయాక 3 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్.. కన్నీళ్లతో చొక్కా తడిసిపోయింది.. నేను ప్రామిస్ చేస్తున్నా.. సినిమా అద్భుతం.. ఇంటర్వల్ తర్వాత ప్రభాస్ ఎంటర్ అవుతాడు.. అక్కడ నుంచి 26 నిమిషాలు ప్రభాస్, విష్ణు, అక్షయ్ కుమార్ వీళ్లంతా అద్భుతం చేస్తారు. ఆ తర్వాత విష్ణు నటన వన్ ఆఫ్ ది మెంబరబుల్ ఫిల్మ్ అనిపిస్తుంది. విష్ణు మంచి నటుడు.. డిసిప్లేండ్ యాక్టర్. డబ్బింగ్ ఎలా చెబుతాడా అనుకున్నా కానీ ఎక్కడ ఒత్తు ఇవ్వాలి ఎక్కడ లేపాలి అంటూ దీం.. తల్లి.. ఇరగదీశాడు అనేశాడు.
ఆయన మంచు విష్ణు నటన గురించి చెబుతూ అలా టంగ్ స్లిప్ అయ్యాడు. ఇక చివరగా ఈ సినిమాకు పనిచేసిన వాళ్లంతా కూడా వాళ్ల రక్తపు బొట్టు పెట్టి ప్రాణం కన్నా ఎక్కువగా తీసిన సినిమా అని అన్నారు బివిఎస్ రవి.
