Begin typing your search above and press return to search.

కోటి రూపాయి కాయిన్స్ తో కారు... వీడియో వైరల్!

ఈ క్రమంలో తాజాగా ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దీనికోసం కోటి రూపాయి కాయిన్ లను చెల్లించాడు!

By:  Tupaki Desk   |   12 Aug 2023 11:44 AM GMT
కోటి  రూపాయి  కాయిన్స్  తో  కారు... వీడియో  వైరల్!
X

ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్‌ ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. దీనికోసం కోటి రూపాయి కాయిన్ లను చెల్లించాడు!

అవును... రూపాయి నాణాలతో కారుకొనాలని ఫిక్సయ్యాడు ఒక యూట్యూబర్! అనుకున్నదే తడవుగా... రూపాయి నాణేలను చెల్లించి కోటి రూపాయల విలువైన పోర్షే 718 బాక్స్‌ స్టర్‌ ను కొనుగోలు చేశాడు. తన ఇంటి వద్దే కాయిన్స్‌ ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్లాడు.

అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం షోరూం బయట ఉన్న మరో కారులో లో ఉంచిన కాయిన్స్‌ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందించాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్‌ ను రాశులుగా పోసి లెక్కించారు.

ఇలా కొన్ని గంటల పాటు శ్రమించిన ఆ షోరూం సిబ్బంది... అనంతరం కోటి రూపాయలూ ఉన్నాయని కన్ ఫాం చేసుకున్నారు. పోర్షే కారును ఆ యూట్యూబర్‌ కు అందించారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్‌ వీడియో షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది!