Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు సీతక్క ఊరికి బస్సు వేశారోచ్

సీతక్కను సొంత సోదరిగా భావించే ముఖ్యమంత్రి రేవంత్ కు తగ్గట్లే.. ఆమెకు తాజా సర్కారులో అధిక ప్రాధాన్యత లభిస్తోంది.

By:  Tupaki Desk   |   14 Dec 2023 6:51 AM GMT
ఎట్టకేలకు సీతక్క ఊరికి బస్సు వేశారోచ్
X

ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన సీతక్క.. తాజాగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించటం తెలిసిందే. రేవంత్ మంత్రి వర్గంలో ఆమె కీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాల్ని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీతక్కను సొంత సోదరిగా భావించే ముఖ్యమంత్రి రేవంత్ కు తగ్గట్లే.. ఆమెకు తాజా సర్కారులో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె సొంతూరుకు ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేదు. దీనిపై ఆమె పలుమార్లుకోరినా ప్రయోజనం లేదు.

ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు చెందిన సీతక్క సొంతూరుకు సంబంధించి ఇటీవల ఒక వార్తాకథనం పబ్లిష్ అయ్యింది. అందులో మంత్రి సొంతూరుకు రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు నడవటం లేదన్న వాదన తెర మీదకు వచ్చింది. దీంతో అధికారులు స్పందించక తప్పనిసరి పరిస్థితి. చూస్తూ.. చూస్తూ మంత్రి సొంతూరుకు బస్సు వేయకపోతే బాగోదు కదా. అందుకే.. వెంటనే స్పందిస్తూ రూట్ సర్వే నిర్వహించారు.

దీనికి సంబంధించిన వివరాల్నిఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మంత్రి సొంతూరుకు రూటు సర్వే నిర్వహించామని.. త్వరలోనే బస్సు నడిపించనున్నట్లు తెలిపారు. పత్తిపల్లి - పొట్లాపూర్ మార్గంలో సీతక్క సొంతూరుకు బస్సు రానుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో మంత్రి సీతక్క ప్రమేయం లేకుండానే బస్సు వేసేందుకు అధికారులు రెఢీ అయిపోయారు. అధికారం చేతిలో ఉండాలే కానీ అధికారులకు సైతం తామేం చేయాలో ఇట్టే అర్థమైపోతుంది.