Begin typing your search above and press return to search.

షర్మిల మాటలకు బీటెక్ రవి సర్టిఫికేట్ ఇవ్వటమా?

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేసి.. రాజకీయాలు చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 April 2024 6:30 AM GMT
షర్మిల మాటలకు బీటెక్ రవి సర్టిఫికేట్ ఇవ్వటమా?
X

తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేసి.. రాజకీయాలు చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన పోటీకి సంబంధించిన వివరాల్ని ఇడుపులపాయలో తన తండ్రి సమాధి సాక్షిగా వెల్లడించటంతో పాటు.. తన సోదరుడిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. షర్మిల చేసిన విమర్శలన్ని నిజమేనంటూ బీటెక్ రవి సర్టిఫై చేయటం ఆసక్తికరంగా మారింది.

ఇలాంటి చర్యలతో కలిగే ప్రయోజనం శూన్యమన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే తన సోదరుడికి వ్యతిరేకంగా గళం విప్పిన షర్మిల మాటల్ని టీడీపీ నేత బీటెక్ రవి వెనకేసుకురావటం... అవన్నీ నిజాలే అంటూ సర్టిఫై చేయటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది. జగన్ - షర్మిల మధ్య జరిగే మాటల యుద్ధం.. రాజకీయంలో ఇంకెవరు ఎంట్రీ ఇచ్చినా దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోగా.. షర్మిలకే ఎక్కువ డ్యామేజీ జరుగుతుందంటున్నారు.

ఎందుకంటే ఇంతకాలం తన సోదరుడి గురించి మాట్లాడని షర్మిల.. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఇది సరిపోదన్నట్లు వైఎస్ సోదరుడు వివేకా హత్యపై టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలకు అనుగుణంగా షర్మిల నోటి నుంచి వస్తే దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదంటున్నారు.ఇదంతా కలిసి కమ్మక్కై వాదనలు వినిపించిన అభిప్రాయం కలుగుతుందంటున్నారు. మరి.. ఈ విషయాన్ని బీటెక్ రవి ఎప్పుడు గుర్తిస్తారు? అన్నది అసలు ప్రశ్న. ఇక.. ఎన్నికల బరిలోకి షర్మిల దిగటం.. కడప ఎంపీగా పోటీ చేయటంపై బీటెక్ రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ ఏ ప్రోగ్రాం చేసినా ఇడుపులపాయకు వెళ్లి.. ఆయన తండ్రి వైఎస్సార్ సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకుంటారని.. ఇప్పుడు తన తండ్రికి ఇష్టమైన తమ్ముడ్ని చంపిన వారికి టికెట్ ఇచ్చి.. ఆయన బిడ్డపై పోటీ పెట్టినందుకు రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభించదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్యపై ఆయన ఫ్యామిలీ అంతా ఎంపీ అవినాష్ రెడ్డి వైపే వేలెత్తి చూపిస్తున్నారని.. ఆయనకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా.. పులివెందుల ప్రజలపై అభిమానం ఉన్నా.. ఎన్నికల బరి నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతు పలకాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ లో రాజారెడ్డి.. రాజశేఖర్ రెడ్డి రక్తం ఉంటే సొంత చెల్లెలిపై ఎలా పోటీ పెడతారన్న బీటెక్ రవి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ సందర్భంగా ఆయన విజయమ్మ ప్రస్తావన తీసుకొచ్చారు. విజయమ్మ మొన్న జగన్మోహన్ రెడ్డి వెంట.. నిన్నషర్మిల వెంట వచ్చారని.. ప్రస్తుతం ఆమె కుమార్తె వెంట ఉంటారా? లేక కొడుక్కి మద్దతు తెలిపి అవినాష్ రెడ్డి వైపు ఉంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.