Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయా ?

గద్దర్ కొడుకు సూర్యంకు టికెట్ ఇచ్చే విషయంలో ఇటు కేసీయార్ అటు రాహుల్ గాంధి కూడా బాగా ఇంట్రెస్టుగా ఉన్నారట.

By:  Tupaki Desk   |   10 Aug 2023 5:34 AM GMT
బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయా ?
X

అవును, అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చాలా తీవ్రంగా పోటీపడుతున్నాయట. దేనికోసమంటే గద్దర్ కొడుకు సూర్యంకు టికెట్ ఇచ్చే విషయంలో. గద్దర్ మరణం తాలూకు సెంటిమెంటును అడ్వాంటేజ్ తీసుకోవటంలో రెండుపార్టీలు పోటీపడుతున్నట్లు రెండుపార్టీల వర్గాలు చెబుతున్నాయి. గద్దర్ కొడుకు సూర్యంకు టికెట్ ఇచ్చే విషయంలో ఇటు కేసీయార్ అటు రాహుల్ గాంధి కూడా బాగా ఇంట్రెస్టుగా ఉన్నారట. ఎందుకంటే గద్దర్ తో రెండుపార్టీలకు మంచి స్నేహ సంబంధాలుండబట్టే.

వాస్తవంగా ఆలోచిస్తే కొంతకాలంగా గద్దర్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకంగా ఉన్నారు. ఏ లక్ష్యం కోసమైతే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరిగిందో ఆ లక్ష్యం పూర్తిగా పక్కదారి పట్టిందని గద్దర్ బాగా కోపంగా ఉండేవారట.

అందుకనే కేసీయార్ మీద అసంతృప్తితోనే కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధిని కూడా కలిశారు. కొడుకును రాహుల్ కు పరిచయటం కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేయాలనే ఆలోచన ఉందేమో తెలీదు.

అయితే ఇంతలోనే మరణించటంతో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి ఇపుడు కొడుకు సూర్యంపైన పడింది. గద్దర్ మరణం తర్వాత ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీలుపడి మరీ పాల్గొన్నారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఎంత ప్రయత్నించినా సూర్యం అధికారపార్టీ వైపు మొగ్గుచూపే అవకాశాలు లేవన్నది టాక్.

ఈ విషయమై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్లు, అధిష్టానం నేతలు కూడా సూర్యం విషయంలో సానుకూలంగా ఉన్నారట. కాకపోతే సూర్యంను ఎక్కడినుండి పోటీచేయించాలన్నదే అసలైన పాయింట్.

ఎందుకంటే గద్దర్ ఉండేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అల్వాల్ ఏరియాలో. కాబట్టి ఆ నియోజకవర్గంలోనే పోటీచేస్తారా లేకపోతే ఇంకెక్కడినుండైనా పోటీచేయించాలా అన్నది ఇంకా డిసైడ్ కాలేదు.

గద్దర్ కొడుక్కి టికెట్ ఇచ్చి పోటీచేయించాలని అనుకుంటున్నారే కానీ అసలు గద్దర్ పై జనాల్లో సానుభూతి ఉందా ? జనాలతో గద్దర్ ఎంతగా కనెక్టయ్యారనే విషయంలో ఎవరికీ స్పష్టతలేదు. తండ్రి చనిపోయిన సానుభూతితో కొడుక్కి టికెట్టిస్తే గెలుస్తారా ? ఏమో చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.