Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్...బీయారెస్ లో బిగ్ చేంజ్....?

కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించి వడపోత పోసి మరీ అభ్యర్ధులను మొదటి జాబితాగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   15 Oct 2023 9:20 AM GMT
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్...బీయారెస్ లో బిగ్ చేంజ్....?
X

కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించి వడపోత పోసి మరీ అభ్యర్ధులను మొదటి జాబితాగా ప్రకటించింది. ఈ జాబితా ఇపుడు అధికార బీయారెస్ లో చర్చకు దారి తీస్తోంది. 55 మందితో కాంగ్రెస్ విడుదల చేసిన మొదటి జాబితాను చూసిన తరువాత బీయారెస్ కూడా అనేక మార్పులు చేర్పులు చేస్తుంది అని ప్రచారం సాగుతోంది. నిజానికి చాలా కాలం క్రితమే కేసీయార్ మొత్తం తెలంగాణాలోని 119 సీట్లకు గానూ 115 సీట్లకు ఒకేసారి అభ్యర్ధులను ప్రకటించారు. అయితే అందులో ఇపుడు భారీ ఎత్తున మార్పులు చేర్పులు చేయబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఎందుచేతనంటే బీయారెస్ మంచి రోజు అని అక్టోబర్ 15న పార్టీ ఆఫీసులో బీ ఫారాలను తాను ప్రకటించిన అభ్యర్ధులకు అందించింది. అయితే కేవలం 51 మందికి మాత్రమే బీ ఫారాలని ఇవ్వడంతో మిగిలిన వారిలో డౌట్లు వస్తున్నాయి. టోటల్ గా 115 మందికీ ఒకేసారి బీ ఫారాలు ఇస్తారని అనుకున్నారు. దానితో పాటు మిగిలిన నలుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించి మొత్తం ఒకే దఫాలో తేల్చేస్తారు అని కూడా భావించారు.

అయితే అర్ధ సెంచరీ దాటకుండా బీ ఫారాలను ఇవ్వడంతో బీయారెస్ మొదట ప్రకటించిన అభ్యర్థులలో బిగ్ చేంజ్ చేయబోతోందా అన్న చర్చ అయితే వస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్ధులలో బలమైన వారు సామాజిక సమీకరణలు ఇతర అంశాలను పరిగణనలో తీసుకుని అక్కడ బీయారెస్ నుంచి వీక్ క్యాండిడేట్ ఉంటే మార్చడానికే అధినాయకత్వం చూస్తోంది అని అంటున్నారు.

దీంతో బీయారెస్ టోటల్ అభ్యర్ధులను డిక్లేర్ చేసినా బీ ఫారాలు దక్కని వారిలో గుండె దడ స్టార్ట్ అయింది. ఇపుడు తమ గతేం కానూ అని చాలా మంది ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే గెలుపే ముఖ్యం కాబట్టి చివరి నిముషం దాకా మార్పులు అలా జరుగుతూనే ఉంటాయని బీయారెస్ వర్గాలలో అంటున్న వారు ఉన్నారు. ఈసారి ఎన్నికలు టఫ్ గా ఉంటాయని బీయారెస్ పెద్దలకు కూడా తెలుసు. కాంగ్రెస్ గతం కంటే బాగా పుంజుకుంది. పైగా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.

కేంద్ర నాయకత్వం అన్నీ దగ్గరుండి చూసుకుంటోంది. సామాజిక వర్గ సమీకరణలను కూడా కాంగ్రెస్ గట్టిగా పట్టించుకుంటోంది. ఈ పరిణామాల క్రమంలో బీయారెస్ తాము కూడా జాగ్రత్తగా ఉండాలని ఆలోచిస్తోంది. నిజానికి బీయారెస్ 115 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించింది. అందులో సిట్టింగులు నూటికి తొంభై అయిదు శాతంగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పట్ల వ్యతిరేకత ఉంది అని వార్తలు వస్తున్నాయి.

ఇక అభ్యర్ధులను ప్రకటించిన తరువాత పార్టీ నిర్వహించిన సర్వేలలో కూడా కొంతమంది వెనుకబడి ఉన్నట్లుగా తేలిందని అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీయారెస్ గట్టిగా తలపోస్తున్నందువల్ల రిస్క్ తీసుకోకూడదనే అనుకుంటోంది. అందుకే అవసరం అయిన చోట అభ్యర్ధులను మార్చాలని కూడా అనుకుంటోందిట. దాని ఫలితమే కేవలం 51 మందికే బీ ఫారాలను ఇచ్చారని తెలుస్తోంది.

అయితే మిగిలిన వారికి కూడా రెండు రోజులలలో బీ ఫారాలు ఇస్తామని చెబుతున్నా చేతిలో పడేవరకూ నమ్మకం లేదని అంటున్నారు. ఇంకో వైపు ప్రచారం చేసినపుడు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని కేసీయార్ తన పార్టీ అభ్యర్ధులకు దిశా నిర్దేశం చేశారు. ప్రత్యర్ధులకు ఎక్కడా దొరకవద్దు అని సూచించారు. ఇక ఎన్నికల సంఘం నిబంధలను కఠినతరం గా ఉన్నాయని వాటిని ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కేసీయార్ కోరినట్లుగా తెలిసింది.

అదే విధంగా టికెట్ ఆశించి భంగపడిన వారు అదే విధంగా అసంతృప్తిగా ఉన్న వారు ఎవరైనా ఉంటే అందరినీ కలుపుకుని పోవాలని చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా చూసుకోవాలని కేసీయార్ సూచించినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తొలి జాబితా బీయారెస్ లో బిగ్ చేంజికి కారణం అవుతోందా అంటే జవాబు అవును అనే వస్తోంది మరి.