Begin typing your search above and press return to search.

మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో... బీఆరెస్స్ కు రేవంత్ బిగ్ షాక్!

మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇళ్లూ అంతే దూరం అనే కామెంట్ రాజకీయాల్లో సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   21 March 2024 8:01 AM GMT
మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో... బీఆరెస్స్  కు రేవంత్  బిగ్  షాక్!
X

మీ ఇంటికి మా ఇళ్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇళ్లూ అంతే దూరం అనే కామెంట్ రాజకీయాల్లో సరిగ్గా సరిపోతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఓడలు బండ్లవుతుంటాయి.. బండ్లు ఓడలవుతుంటాయి. ఇక్కడ ఏమి విత్తుతామో.. అదే కోస్తాము అన్నట్లుగానే వ్యవహారం ఉంటుంది. ఇన్ని ఉదాహరణలు ఎందుకంటే... గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యవహార శైలినే ఫాలో అవుతూ... చావుదెబ్బ కొట్టడానికి రేవంత్ & కో ఫిక్సయ్యారని తెలుస్తుంది.

అవును... గతంలో రెండు దఫాలు తెలంగాణలో కేసీఆర్ ఎలాంటి ఆలోచన చేశారో.. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా అదే దిశగా ముందుకు కదులుతుందని తెలుస్తుంది. ఇది బీఆరెస్స్ కు చావుదెబ్బ అనే చర్చ తెరపైకి వస్తుంది. ప్రతిపక్షాలను బలహీనపర్చడం కోసం కేసీఆర్ ఎంచుకున్న మార్గానే.. ప్రస్తుతం రేవంత్ కూడా ఎంచుకుంటున్నారని తెలుస్తుంది. ఈ దెబ్బ ఎంత గట్టిగా తగిలితే... బీఆరెస్స్ కోలుకోవడానికి అంత సమయం పడుతుందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... 2014 ఎన్నికల అనంతరం కేసీఆర్ తొలిసారి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు వచ్చిన 63స్థానాలతోనూ తృప్తి పడలేదు! దీంతో... ప్రతిపక్ష పార్టీలనుంచి 21 మందిని తమ ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 5 గురిని, వైసీపీ నుంచి ముగ్గురు, సీపీఐ నుంచి ఒక్కరిని పార్టీలో చేర్చుకున్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వచ్చినా కేసీఆర్ లైట్ తీసుకున్నారు!

ఇదే క్రమంలో 2018లో మరోసారి అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ఇందులో భాగంగా 2018లో జరిగిన ఎన్నికల్లో 88 స్థానలలో బీఆరెస్స్ అభ్యర్థులు గెలుపొందారు. అయినప్పటికీ తృప్తి లేదో ఏమోకానీ... కాంగ్రెస్ నుంచి ఎన్నికైన 19మందిలో ఏకంగా 12మంది కారెక్కించేసుకున్నారు. దీనిపైనా తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు అనే కామెంట్లూ వినిపించాయి. అయినా... కేసీఆర్ లైట్ తీసుకున్నారు!

కట్ చేస్తే... 2023 ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో అధికారంలోకి రాగా.. 39 స్థానాలకు పరిమితమైన బీఆరెస్స్ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాలతో నిలిచింది. అయితే... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి టైం వచ్చినట్లుగా మారిపోయింది పరిస్థితి! ఇందులో భాగంగా బీఆరెస్స్ నుంచి భారీ సంఖ్యలో నేతలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా ఉన్న 39మందిలోనూ సుమారు 26మంది బీఆరెస్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం వారంతా కారు దిగిపోవడానికి లగేజ్ సర్ధుకుని రెడీగా ఉన్నారని అంటున్నారు. దీంతో... ఇదే జరిగితే బీఆరెస్స్ కి అది చావుదెబ్బ కిందే లెక్క అని.. పైగా లోక్ సభ ఎన్నికల ముంగిట జరిగితే అది మరింత భారీ దెబ్బ అని.. ఫలితంగా బీఆరెస్స్ ఇప్పట్లో తేరుకునే అవకాశం లేదని అంటున్నారు.

మరి బీఆరెస్స్ ని ఆ రేంజ్ లో చావుదెబ్బ కొట్టడానికి రేవంత్ & కో సిద్ధంగా ఉంటారా? ముహూర్తం ఫిక్స్ చేసేసుకున్నారా? లేక, మనకెందుకులే వాళ్లంతా అని లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి. రేవంత్ దూకుడు చూస్తుంటే... కారుని ఖాళీ చేయడానికే అధిక ఉత్సాహం చూపిస్తున్నారని.. టిట్ ఫర్ టేట్ దిశగానే ఆయన ఆలోచిస్తున్నారని అంటున్నారు!