Begin typing your search above and press return to search.

నాడు - నేడు... బీఆరెస్స్ ఎమ్మెల్యే ఫ్యామిలీ పిక్ వైరల్!

ఆయన అభ్యర్థనను ఆమోదించి హుజూరాబాద్ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో... ఈ గ్రాండ్ విక్టరీ కౌశిక్ లైఫ్ ని మార్చేసిందని అంటున్నారు పరిశీలకులు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 9:25 AM GMT
నాడు - నేడు... బీఆరెస్స్  ఎమ్మెల్యే ఫ్యామిలీ పిక్  వైరల్!
X

సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి రాత్రి రాత్రి లైఫ్ మారిపోతుంటుంది! శుక్రవారం సినిమా విడుదల అనంతరం ఒక్క రోజులో స్టార్ డం వచ్చేస్తుంటుంది! ఇదే క్రమంలో రాజకీయాల్లో కూడా సడన్ గా లైఫ్ మారిపోతుంటుంది. అప్పటివరకూ చాలా నార్మల్ గా కనిపించిన మనుషులు... సడన్ గా ఎర్ర బుగ్గ కార్లలో దర్శనమిస్తుంటారు. ఇలా సడన్ గా లైఫ్ ఛేంజ్ అయిపోయిన రాజకీయ నాయకుల్లో పాడి కౌశిక్ రెడ్డి పేరును పలువురు ప్రముఖంగా ప్రస్థావిస్తుండటం గమనార్హం.


తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన హుజూరాబాద్ నుంచి బీజేపీ కీలక నేత ఈటల రాజేందర్ పోటీచేసిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఆయనకు పోటీగా బీఆరెస్స్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. దీంతో... అనుభవజ్ఞుడైన ఈటల రాజేందర్‌ ను ఓడించడం పాడి కౌశిక్ రెడ్డికి అంత ఈజీ కాదనే కామెంట్లు వినిపించాయి.

ఈ సమయంలో అవిరామంగా ప్రచారం చేసుకున్న కౌశిక్ రెడ్డికి అతని భార్య, కుమార్తె కూడా సపోర్ట్ చేశారు. ప్రధానంగా అతడి కుమార్తె సైతం తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంది. ఈ సమయంలో ప్రధానంగా ఎన్నికల ప్రచారం చివరిరోజు చివరి నిమిషంలో మైకందుకున్న పాడి కౌశిక్ రెడ్డి... ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే విజయోత్సవ యాత్రకు వస్తానని.. ఓడిస్తే ప్రజలంతా తన కుటుంబ శవయాత్రకు రావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కౌశిక్ దిగులుగా, సానుభూతితో కనిపించాడు! ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో అతడు కూర్చిని కనిపించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఏ శక్తి పనిచేసిందో ఏమో కానీ... ఆయన అభ్యర్థనను ఆమోదించి హుజూరాబాద్ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. దీంతో... ఈ గ్రాండ్ విక్టరీ కౌశిక్ లైఫ్ ని మార్చేసిందని అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలో తాజాగా కౌశిక్ రెడ్డి, అతని కుటుంబం తాజా ఫోటోలు వైరల్ గా మారాయి! తాజా ఫోటోల్లో వారు మంచి ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా వారి ముఖల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చి, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యో దక్కిన విజయాన్ని ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు మంచి ఉత్సాహంతో కనిపిస్తుండటం విశేషం.

దీంతో... నాడు - నేడు అన్నట్లుగా ఎన్నికలకు ముందు, ఎన్నికల ఫలితాల అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.