Begin typing your search above and press return to search.

ఓటమి బాటలో బీయారెస్ మంత్రులు...?

తెలంగాణా ఎన్నికల ఫలితాలు రావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక్క రోజు ఆగితే హాట్ హాట్ సండే గా తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఆదివారం వస్తాయి.

By:  Tupaki Desk   |   1 Dec 2023 3:30 PM GMT
ఓటమి బాటలో బీయారెస్ మంత్రులు...?
X

తెలంగాణా ఎన్నికల ఫలితాలు రావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక్క రోజు ఆగితే హాట్ హాట్ సండే గా తెలంగాణా ఎన్నికల ఫలితాలు ఆదివారం వస్తాయి. దాంతో తెలంగాణా రాజకీయం అంతా వేడిగా ఉంది. పోలింగ్ జరిగింది, ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయి. కాంగ్రెస్ గెలుస్తుంది అని అనేక సర్వేలు చెబుతున్నాయి

దాదాపుగా ఇరవై దాకా ఎగ్జిట్ పోల్స్ వస్తే అందులో పదిహేడు దాకా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. ఇక రెండు సర్వేలు బీయారెస్ కి అధికారం ఇస్తే ఒకటి రెండు సర్వేలు హంగ్ వైపుగా చూపించాయి. ఈ పరిణామాలు ఇలా ఉంటే తెలంగాణాలో సైలెంట్ వేవ్ నడచిందా అన్న చర్చ సాగుతోంది. సైలెంట్ వేవ్ అయితే మహామహులే కొట్టుకుపోతారని గత రాజకీయ చరిత్ర రుజువు చేస్తోంది.

దాంతో తెలంగాణాలో ఓడిపోయే వారు ఎవరు అన్న దాని మీద ఎవరికి తోచిన తీరున వారు విశ్లేషించుకుంటున్నారు. కేసీయార్ క్యాబినేట్ లో ఎంత మంది మంత్రులు తిరిగి గెలుస్తారు అన్నది కూడా అతి పెద్ద ప్రశ్నగా ఉంది. మొత్తం మంత్రులు కేసీయార్ కాకుండా పదిహేడు మంది దాకా ఉన్నారు. అయితే ఇందులో గట్టిగా తిరిగి గెలిచేది ముగ్గురు నలుగురు తప్ప ఎవరూ కారని అంటున్నారు.

ఇక ఆ గెలిచే వారిలో మంత్రి హరీష్ రావు, కేటీయార్ ఉంటారని అంటున్నారు. ఇక్కడ కూడా హరీష్ రావు సిద్ధిపేటలో ఎలాంటి ఆయాసం లేకుండా కంఫర్ట్ జోన్ లోనే గెలుస్తారని అంటున్నారు. కేటీయార్ మాత్రం అతి కష్టం మీద గెలుస్తారు అని అంటున్నారు. ఇక గెలిచే ఆ మూడవ మంత్రి ఎవరు అన్నది చూడాలని అంటున్నారు.

ఓడే మంత్రుల లిస్ట్ చూస్తే చాలానే ఉంది అంటున్నారు. గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకరరావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వరరెడ్డి, ప్రశాంత్ కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డికి ఓటమి తప్పదనే సంకేతాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఓడిపోతామన్న సంగతి మంత్రులకు కూడా తెలుసు అని అంటున్నారు. చాలా మంది మంత్రులు ప్రచారానికి వెళ్తే ప్రజల నుంచి తిరస్కారాలు ఎదురయ్యాయని కొన్ని చోట్ల మా వైపు రావద్దు అని ముందే చెప్పేసారు అని అంటున్నారు.

దాంతో అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం దండుగ అనే కొంతమంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పొదుపుగానే తిరిగి పొదుపుగానే ఖర్చు చేశారు అని కూడా అంటున్నారు. సరిగ్గా పోలింగ్ కి మూడు రోజుల ముందే కొంత మంది మంత్రులు ట్రెండ్ ని చూసి ప్రచార పటాటోపాలను తగ్గించుకున్నారు అని అంటున్నారు. ఇక మరికొంతమంది మంత్రులు మాత్రం ప్రచారం గట్టిగా చేసినా లోపల ఓటమి భయం పీకుతోందని అని అంటున్నారు.

ఏది ఏమైనా మెజారిటీ మంత్రులు ఓటమి బాట పడతారు అని అంటున్నారు. సైలెంట్ వేవ్ బలంగా వీస్తే మంత్రులతో పాటు బీయారెస్ అగ్ర నాయకత్వంలోని త్రయానికి కూడా ముప్పు ముంచుకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా ఓటమి అన్న ఆలోచన ఇపుడు మంత్రులను వెంటాడుతోంది అని అంటున్నారు. డిసెంబర్ 3వ తేదీ వరకూ ఈ రకమైన టెన్షన్ తప్పదని అంటున్నారు. అసలు ఫలితాలు ఏ రకమైన సందేశాలను ఇస్తాయో చూడాల్సి ఉంది.