Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి బీఆరెస్స్ నేతలు.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా ఇప్పటికే ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించగా... తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.

By:  Tupaki Desk   |   19 Jan 2024 1:47 PM GMT
కాంగ్రెస్  లోకి బీఆరెస్స్  నేతలు.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

గతకొన్ని రోజులుగా... పలువురు బీఆరెస్స్ నేతలు అధికార కాంగ్రెస్ వైపు రావడానికి చూస్తున్నారంటూ తెలంగాణ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చర్చ బరింత బలంగా సాగుతుంది. ఈ విషయంపై తెలంగాణ మంత్రులు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించగా... తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా అసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... బీఆరెస్స్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పలువురు ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని.. అయితే తామే ఎవరినీ ఆ విషయంలో ప్రోత్సహించడం లేదని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. అసెంబ్లీలో తమకు సరిపడా మెజారిటీ ఉందని తెలిపారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వేల కోట్లు గుమ్మరించినా ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారని తెలిపారు.

ఇదే సమయంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆరెస్స్ పార్టీకి రెండు, మూడు సీట్లకు మించి రావని జోస్యం చెప్పిన జూపల్లి... ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికే అభ్యర్థులు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల సమయలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 2 అమలు చేశామని చెప్పిన ఆయన... మిగతా హామీలు కూడా అమలయితే బీఆరెస్స్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్ధం చేసుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ఇంతకాలం బీఆరెస్స్ ప్రభుత్వం చెప్పిన అప్పులపై షాకింగ్ విషయాలు వెల్లడించారు జూపల్లి! ఇందులో భాగంగా... బీఆరెస్స్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని దుబ్బయట్టారు. ఫలితంగా... రూ.7 లక్షల కోట్ల అప్పు చేయగా దానికి రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోందని వెల్లడించారు.

అదేవిధంగా... అదానీని తెలంగాణ సీఎం రేవంత్ కలవడం బీఆరెస్స్ నేతలు చేస్తున్న విమర్శలపైనా జూపల్లి స్పందించారు. ఇందులో భాగంగా... తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్‌ రెడ్డి కలిశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానీని రేవంత్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇదే సమయంలో... బీఆరెస్స్ - బీజేపీ మైత్రి ప్రజలందరికీ తెలుసునని జూపల్లి కామెంట్ చేశారు.