Begin typing your search above and press return to search.

గులాబీ సిట్టింగ్ ఎంఎల్ఏల్లో అయోమయం

కాంగ్రెస్ లోకి జంప్ చేసినా టికెట్లు దక్కదు అన్నపుడు ఇక పార్టీ మారి ఉపయోగం ఏమిటనే విషయంలోనే చాలామంది ఊగిసలాడుతున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   25 Aug 2023 6:42 AM GMT
గులాబీ సిట్టింగ్ ఎంఎల్ఏల్లో అయోమయం
X

గులాబీ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్లు దక్కదని నూరుశాతం క్లారిటీ వచ్చేసింది. కేసీయార్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే టికెట్లు దక్కని సిట్టింగుల్లో కొందరు అప్పుడే కాంగ్రెస్ పార్టీతో మంతనాలు మొదలుపెట్టేశారు. మరికొందరు వెయిట్ అండ్ వాచ్ పద్దతిలో సాగదీస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే గులాబీ నేతల్లో అయోమయం పెరిగిపోతుండటమే. అయోమయం ఎందుకు పెరిగిపోతోంది అంటే అర్జంటుగా కాంగ్రెస్ లోకి దూకినా టికెట్లు వస్తాయా ? అనే అనుమానం పట్టి పీడిస్తోందట.

కాంగ్రెస్ లోకి జంప్ చేసినా టికెట్లు దక్కదు అన్నపుడు ఇక పార్టీ మారి ఉపయోగం ఏమిటనే విషయంలోనే చాలామంది ఊగిసలాడుతున్నట్లు సమాచారం. టికెట్లు దక్కని ఏడుమంది సిట్టింగుల్లో కొందరు, పెండింగ్ పెట్టిన నాలుగు నియోజకవర్గాల్లోని సిట్టింగులు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో టచ్ లో ఉన్నారు. వీరిలో కొందరు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎంఎల్ఏ రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ లో చేరిపోయారు కూడా.

టికెట్లు దక్కని వాళ్ళ విషయం ఫైనల్ అయిపోయింది. మరి పెండింగ్ లో పెట్టిన నాలుగు నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏల మాటేమిటి ? అన్నదే అర్ధం కావటంలేదు. బీఆర్ఎస్ లో ఉంటూనే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, మధుయాష్కి లాంటి వాళ్ళతో టచ్ లో ఉన్నారు. అయితే ఎంతమందితో టచ్ లో ఉన్నా టికెట్ గ్యారెంటీ విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి.

తుమ్మల నాగేశ్వరరావు, తాటికొండ రాజయ్య, జలగం వెంకటరావు, వేముల వీరేశం, ముద్దగోని రామ్మోహన్ గౌడ్, నీలం మధు ముదిరాజ్, ఎడ్ల సుధాకరరెడ్డి తదితరులతో కాంగ్రెస్ సీనియర్లు టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఎవరు ఎవరితో టచ్ లో ఉన్నా, ఎవరితో భేటీలు అయినా నష్టం ఏమీలేదు కానీ టికెట్ అవకాశాలే కీలకంగా మారుతున్నాయి. కాంగ్రెస్ గనుక టికెట్ హామీలు ఇవ్వగలిగితే దాదాపు ఏడెనిమిది మంది సిట్టింగులు హస్తంపార్టీలోకి దూకే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.