Begin typing your search above and press return to search.

బీఆరెస్స్ నేత షకీల్ కొడుకు కేసులో కొత్త ట్విస్ట్!

అవును... 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగింది.

By:  Tupaki Desk   |   21 March 2024 9:56 AM GMT
బీఆరెస్స్  నేత షకీల్   కొడుకు కేసులో కొత్త ట్విస్ట్!
X

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజాభవన్ (నాటి ప్రగతి భవన్) సమీపంలో రోడ్డు ప్రమాదం కేసులో బీఆరెస్స్ నేత షకీల్ కుమారుడు రాహిల్ పరారీలో ఉన్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో వారికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు! ఆ కేసు సంగతి అలా ఉండగా... జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ కేసులోనూ షకీల్ కొడుకు పేరు తెరపైకి వచ్చింది.

అవును... 2022 మార్చి 17న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలు కాగా.. రెండు నెలల బాలుడు మృతిచెందాడు. ఈ సమయంలో ఆ కేసులో ఇప్పుడు కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో షకీల్ కొడుకు రహీల్ డ్రైవర్ కారు నడిపినట్లు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు! అయితే... ఆ కేసును రీ ఓపెన్ చేసిన వెస్ట్ జోన్ పోలీసులకు ఆ ప్రమాదానికీ రాహీలే కారణం అని గుర్తించినట్లు తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... సుమారు రెండేళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ప్రమాదం జరిగింది! ఇందులో భాగంగా దుర్గం చేరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వస్తున్న మహీంద్రా థాన్ వెహికల్... రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది! దీంతో... ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలు కాగా, రెండు నెలల బాలుడు మరణించాడు! ఈ సమయంలో... ప్రమాదానికి కారణమైన కారు నాటి బీఆరెస్స్ ఎమ్మెల్యే షకీల్ దని తేలగా... పోలీస్ విచారణలో డ్రైవర్ ఆఫ్రాన్ అనే యువకుడు తానే కారు నడిపినట్లు అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు!

ఇదే సమయంలో ప్రమాదం జరిగిన సమయంలో కారు స్టీరింగ్ పై ఉన్న వేలిముద్రలు కూడా అఫ్రాన్ వే అని పోలీసులు నాడు ప్రకటించారు. అయితే తాజాగా ఆ కేసును రీఓపెన్ చేయగా... ఆ ప్రమాదంలోనూ కారు నడిపింది రహీలే అని గుర్తించారని తెలుస్తుంది. తాజాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా మరోసారి దర్యాప్తు చేయగా... ప్రమాదం జరిగిన సమయంలో కారులో షకీల్ కొడుకు రాహిల్, మరో యువకుడు ఉన్నట్లు తేలిందని తెలుస్తుంది!