Begin typing your search above and press return to search.

బీయారెస్ కి బిగ్ షాక్ ఇచ్చిన సర్వే... లాస్ట్ మినిట్ లో పీకే ఎంట్రీ !

అధికార బీయారెస్ కి బిగ్ షాక్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని ప్రచారం సాగుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో తెలంగాణాలో మొత్తం సీన్ మారిపోయింది అని అంటున్నారు

By:  Tupaki Desk   |   22 Nov 2023 9:30 AM GMT
బీయారెస్ కి బిగ్ షాక్ ఇచ్చిన  సర్వే... లాస్ట్ మినిట్ లో పీకే  ఎంట్రీ !
X

అధికార బీయారెస్ కి బిగ్ షాక్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని ప్రచారం సాగుతోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలో తెలంగాణాలో మొత్తం సీన్ మారిపోయింది అని అంటున్నారు. ఈ సారి సీట్లు తగ్గుతాయని బీయారెస్ లోనూ అంతర్మధనంగా చర్చ ఉంది. అయితే సింపుల్ మెజారిటీ అయినా వస్తుందని ఊహించిన అధినాయకత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక మాత్రం షాకింగ్ న్యూస్ గా మారింది అని అంటున్నారు.

ఇంతకీ ఇంటెలిజెన్స్ సర్వే నివేదికలో ఏముంది అంటే చాలా చిత్ర విచిత్రాలు ఉన్నాయని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ మాత్రం వేరుగా ఉన్నాయని అంటున్నారు. ఊహించని విధంగా వ్యతిరేకత బాగా ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే ప్రముఖ సంస్థలు ఇప్పటిదాకా చేసిన సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్ కే మెజారిటీ సీట్లు వస్తాయని తేల్చి చెప్పాయి. అయితే బీయారెస్ అధినాయకత్వం అతి విశ్వాసమో లేక ఆత్మ విశ్వాసమో తెలియదు కానీ వాటిని అంతగా పట్టించుకోలేదు అని అంటున్నారు. అయితే రోజు రోజుకూ మారుతున్న పరిణామాలతో బీయారెస్ నేరుగా ఈసారి ఇంటెలిజెన్స్ సర్వేని చేయించింది అని అంటున్నారు.

సరిగ్గా ఇక్కడే షాకింగ్ నిజాలు బీయారెస్ నేతలను నిద్ర పట్టకుండా చేశాయని అంటున్నారు. ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లుగా ఇంటెలిజెన్స్ సర్వే అనీ బయటపెట్టింది అని అంటున్నారు. ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ భారీ విజయం వైపుగా దూసుకుని వెళ్తోంది అని తేలింది అంటున్నారు.

దీంతో ఏమి చేయాలి అన్నది బీయారెస్ అగ్ర నాయకత్వానికి అర్ధం కాకుండా ఉందని అంటున్నారు. ఉన్నది అతి కొద్ది సమయం కాబట్టి జనాల అభిప్రాయాలను తమ వైపునకు ఎలా తిప్పుకోవాలీ అన్నది బీయారెస్ కి బిగ్ టాస్క్ గా మారింది అని అంటున్నారు. దాంతో బీయారెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ని హుటాహుటిన పిలిపించాలని నిర్ణయించిందని అంటున్నారు.

అదే విధంగా ఐప్యాక్ టీం ని కూడా వెనువెంటనే సంప్రదించడం కూడా చకచకా జరిగిపోయాయని అంటున్నారు. ఇదిలా ఉండగా గులాబీ పెద్దల ఆదేశానుసారం తాజాగా ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ రావడం జరిగింది అని అంటున్నారు. ఇక ఆయనతో మూడు గంటల పాటు బీయారెస్ అధినాయకత్వం ఏకాంత చర్చలు జరిపింది అని అంటున్నారు.

ఈ కొద్ది రోజులూ చాలా ముఖ్యం, మీ సేవలు అందించడం, ముందు పార్టీని గెలిపించండి. ఆ తరువాత ఏమున్నా మాట్లాడుకుందామని స్వయంగా కేసీయార్ పీకేతో అన్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఆ తరువాత కేటీయార్ హరీష్ రావు, కవిత కూడా ప్రత్యేకంగా భేటీ అయి అనేక విషయాలు చర్చించారు అని అంటున్నారు.

ఇక నేరుగా కేసీయార్ నుంచే గెలిపించండి అంటూ భారీ ఆఫర్ రావడంతో పీకే కాదనలేకపోయారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే లాస్ట్ మినిట్ లో రంగంలోకి దిగారని అంటున్నారు. ఇదిలా ఉండగా మొదట్లో పీకే సేవలను వాడుకోవాలని చూసిన బీయారెస్ అధినాయకత్వం ఆ తరువాత ఎందుకో వెనక్కి తగ్గింది. దాంతోనే పీకే కూడా డ్రాప్ అయ్య్యారని టాక్ నడచింది.

ఇపుడు లెవెంత్ అవర్ లో పీకే బీయారెస్ అధినాయకత్వానికి గుర్తు రావడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఇక పీకే చూస్తే ఆయనది లక్కీ హ్యాండ్ అని చెబుతారు. ఆయన టేకప్ చేసిన పార్టీలు అన్నీ అధికారాన్ని అందుకున్నాయి. ఇదిలా ఉంటే బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో పీకే వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు.

ఇక తెలంగాణా కాంగ్రెస్ కి పీకే శిష్యుడు సునీల్ కనుగోలు వ్యూహకర్తగా ఉన్నారు. ఇపుడు లాస్ట్ మినిట్ లో గురువు పీకే బీయారెస్ వైపు వచ్చారు. దాంతో పీకే ఏమి మ్యాజిక్ చేస్తారు అన్నది చర్చగా ఉంది. బీయారెస్ లో సడెన్ గా చోటు చేసుకున్న ఈ పరిణామాలు చూసిన రాజకీయాలు అంటే అభిమానం ఆసక్తి ఉన్న గురురాజు అంజన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా ఈ విషయం రాసుకొచ్చారు.

నాడు పీకే వద్దు నేడు మాత్రం ముద్దు అని ఆయన ట్విట్టర్ లో పెట్టిన ఈ మెసేజ్ ఇపుడు వైరల్ గా మారింది. అయితే దీన్ని బీయారెస్ నేతలు ఖండించకపోవడం చిత్రం. ఇదిలా ఉంటే కారు పార్టీని జోరు చేసే బాధ్యత పీకే తీసుకుని గెలుపు దారి చూపిస్తారా లేదా అన్నది కొద్ది రోజులలో తేలనుంది అని అంటున్నారు. పీకే కనుక రంగంలో ఉంటే విజయం అన్న మాట నిజం అవుతుందా లేక సర్వేలు చెప్పినట్లుగా కాంగ్రెస్ గెలుస్తుందా అన్నది చూడాలని అంటున్నారు.