Begin typing your search above and press return to search.

వరాల పెట్టె తెరుచుకోలేదు.. తెరిస్తే అంతే సంగతులట

వరాల దేవుడిగా తనకున్న ఇమేజ్ ను మరోసారి చూపించాల్సిన అవసరం వచ్చిందన్న భావనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు

By:  Tupaki Desk   |   4 Oct 2023 4:24 AM GMT
వరాల పెట్టె తెరుచుకోలేదు.. తెరిస్తే అంతే సంగతులట
X

వరాల దేవుడిగా తనకున్న ఇమేజ్ ను మరోసారి చూపించాల్సిన అవసరం వచ్చిందన్న భావనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో డైలీ బేసిస్ లో వరాల్ని ప్రకటించి.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఆయన.. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ తనలోని వరాల దేవుడ్ని నిద్ర లేపినట్లుగా చెబుతున్నారు. ఐదు హామీల పేరుతో తెలంగాణ కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేస్తున్న వేళ.. వాటిని తలదన్నేలా కొన్ని పథకాల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

అధికార పార్టీగా తమకున్న అడ్వాంటేజ్ ను పూర్తిగా వినియోగించుకోవటానికి వీలుగా.. వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రత్యర్థులు ఇవ్వాల్సిన వరాల్ని ఇచ్చేసిన తర్వాత.. ఫైనల్ గా తమ వరాల పెట్టెను వరాల దేవుడి ఓపెన్ చేస్తారని చెబుతున్నారు. అప్పటికే వరాలు ప్రకటించి.. హామీలు ఉదరగొట్టి అలిసిపోయే ప్రత్యర్థులు.. తమ బిగ్ బాస్ కొట్టే మాస్టర్ స్ట్రోక్ కు నోట మాట రానట్లుగా ఉండిపోతారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అందులో భాగంగానే గడిచిన కొంతకాలంగా ఎలాంటి హామీల్ని ఇవ్వట్లేదని గుర్తు చేస్తున్నారు. తాము పూర్తి చేసిన పనుల్ని ప్రారంభించటం.. కొత్తవాటిలో కొన్నింటికి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఎన్నికల వేళలో అదిరే హామీల్ని ఇచ్చేందుకు గడిచిన కొన్ని వారాలుగా భారీ ఎత్తున కసరత్తు జరిగిందని.. ఇప్పటికే ఏమేం హామీలు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అన్న దానిపై పూర్తి క్లారిటీతో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రత్యర్థుల హామీల్ని చూసిన ప్రజలు సైతం ఆశ్చర్యపోయే సరికొత్త హామీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెర తీస్తారని చెబుతున్నారు.

కేసీఆర్ లోని వరాల దేవుడు నిద్ర లేచి చాలా రోజులైందని.. అన్నింటిని డ్రాఫ్ట్ చేయటమేకాదు.. హామీల ప్రకటన తర్వాత.. వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అందుకు ఏయే మాథ్యమాల్ని వినియోగించాలన్న దానిపై పక్కాగా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. గులాబీ నేతలు ఇంతలా ఊరిస్తున్న వరాలు ఏమై ఉంటాయా? అన్నదిప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.