Begin typing your search above and press return to search.

క్రామ్రేడ్లను వెయిటింగ్ లిస్టులో పెట్టేశారా ?

విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వామపక్షాలతో పొత్తుంటుందని అనుకుంటున్నారు

By:  Tupaki Desk   |   11 Aug 2023 5:23 AM GMT
క్రామ్రేడ్లను వెయిటింగ్ లిస్టులో పెట్టేశారా ?
X

కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. అవసరం అనుకుంటే ఎదుటివాళ్ళని నెత్తిన పెట్టుకుంటారు. అదే అవసరం తీరిపోయినా, ఇక అవసరం రాదని అనుకున్నా వెంటనే తీసి అవతల పడేస్తారు. కనీసం అలాంటివాళ్ళతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. ఈ విషయం చాలామందికన్నా కమ్యూనిస్టు పార్టీలకు బాగా తెలుసు. అయినా సరే ఇపుడు మళ్ళీ కేసీయార్ తో గొళ్ళెంపెట్టుకుని నానా అవస్తలు పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలో తెలీదు, కేసీయార్ తో పొత్తుంటుందో లేదో తెలీదు.

విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వామపక్షాలతో పొత్తుంటుందని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే మునుగోడు ఉపఎన్నికలు జరిగినపుడు బీఆర్ఎస్ గెలుపుకు కేసీయార్ వామపక్షాల మద్దతు తీసుకున్నారు. అప్పట్లో వామపక్షాల మద్దతు లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయేవారే అనటంలో సందేహంలేదు. అప్పట్లో కమ్యూనిస్టుల మద్దతు తీసుకునేటప్పుడే రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని కేసీయార్ హామీ ఇచ్చారట.

కేసీయార్ హామీని నమ్మి అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకరరెడ్డిని వామపక్షాలు గెలిపించాయి. సో అవసరం తీరిపోయింది కదా అందుకనే అప్పటినుండి కమ్యూనిస్టులను కేసీయార్ దగ్గరకు రానీయటంలేదు. అప్పట్లో తమకిచ్చిన పొత్తు హామీగురించి గుర్తుచేయాలని వామపక్షాలు ఎంత ప్రయత్నిస్తున్నా కేసీయార్ అవకాశం ఇవ్వటంలేదు. దాంతో వామపక్షాలకు ఏమిచేయాలో అర్ధంకాక దిక్కుతోచటంలేదు. అప్పటికీ డెడ్ లైన్ విధించి స్పందించకపోతే ఒంటరిపోటీకి రెడీ అయిపోతామని కూడా ప్రకటించాయి. అయినా సరే కేసీయార్ లెక్కచేయటంలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే వామపక్షాలతో పొత్తు వద్దని కీలకనేతలు కేసీయార్ కు చెబుతున్నారట. వామపక్షాల నుండి బీఆర్ఎస్ కు ఓట్లు బదిలీ కావని చెప్పారట. అలాంటపుడు పొత్తుపెట్టుకుని నష్టపోవటం తప్ప ఉపయోగంలేదని స్పష్టంగా చెప్పారని కారుపార్టీ నేతల సమాచారం. అందుకనే కేసీయార్ కూడా రెండో ఆలోచనకు వచ్చినట్లు పార్టీలో టాక్. ఈ కారణంగానే వామపక్షాలను దూరంగా పెడుతున్నారట. మరి ఇలా ఎంతకాలం ఏదీ తేల్చకుండా దూరంపెడతారో కేసీయార్ కే తెలియాలి. మొత్తంమీద కేసీయార్ ఆలోచను చూస్తుంటే పొత్తుల విషయంలో కమ్యూనిస్టులను వెయిటింగ్ లిస్టులో పెట్టినట్లే అనిపిస్తోంది.