Begin typing your search above and press return to search.

16 ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు

పదహారు న్యూస్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

By:  Tupaki Desk   |   31 May 2024 6:26 PM IST
16 ఛానళ్లపై బీఆర్ఎస్ ఫిర్యాదు
X

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఅర్ఎస్ అధినేత కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని 16 న్యూస్ ఛానల్స్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదహారు న్యూస్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

నిరాధారమైన వార్తలను ప్రచారం చేస్తూ తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆధారాలు లేని కథనాలు ఇచ్చే మీడియాను కట్టడి చేయాలని పోలీసులను కోరినట్లు వెల్లడించారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వీ6, ఎన్టీవీ, ఐన్యూస్, అమ్మా, బీఆర్కే, జర్నలిస్ట్ సాయి, మైక్ టీవీ, నేషనలిస్ట్ హబ్, ప్రైమ్ న్యూస్, ఆర్టీవీ, రాజ్ న్యూస్, రెడ్ టీవీ తదితర పదహారు న్యూస్ ఛానల్స్‌పై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇటీవల లిక్కర్ కేసుకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ కేసీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని అన్నారు. మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా కేసీఆర్ గారి మీద అసత్యాలతో కూడిన వార్త కథనాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని కథనాలు ప్రసారం చేయాలని సూచించారు.