Begin typing your search above and press return to search.

ఈసీకి బీఆర్ఎస్.. కాంగ్రెస్ లు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఏముంది?

ఇంతకూ ఈ రెండు పార్టీలు చేస్తున్న ఫిర్యాదులేంటి? వారు కోరుకుంటున్నదేంటి? వారి వాదనలు ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 3:58 AM GMT
ఈసీకి బీఆర్ఎస్.. కాంగ్రెస్ లు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఏముంది?
X

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల వేడి అంతకంతకూ రాజుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చి.. రిజెక్టు చేసే వారి జాబితాలు విడుదలవుతున్న వేళలో.. అధికార బీఆర్ఎస్.. విపక్ష కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కంప్లైంట్లు చేసుకుంటూ.. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకూ ఈ రెండు పార్టీలు చేస్తున్న ఫిర్యాదులేంటి? వారు కోరుకుంటున్నదేంటి? వారి వాదనలు ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. సోమవారం బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్యులు ఎన్నికల సంఘం అధికారుల్ని కలిసి తమ అభ్యంతరాల్ని తెలియజేశారు. ఈ రెండు పార్టీల అభ్యంతరాలు ఏమిటి? వారి ఫిర్యాదుల్లో ఏముంది? అన్న విషయాల్లోకి వెళితే..

బీఆర్ఎస్ వాదన కం ఫిర్యాదులు ఇవే..

- పచ్చగా ఉండే తెలంగాణను హింసాత్మకంగా చేసేందుకు ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. క్యాడర్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.

- దుబ్బాక.. అచ్చంపేట ఘటనలు చూసినా.. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఇప్పటికి సీరియస్ గానే ఉంది. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులు జరిగితే రేవంత్.. కనీసం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు.

- పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయా? ఇప్పుడు జరుగుతున్న ఘటనలు ఎవరి వల్ల జరుగుతున్నాయో తెలుసుకోవాలి.

- రేవంత్ కు టీడీపీ తల్లి పార్టీ అయితే.. కాంగ్రెస్ అత్తపార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి అంతర్గత ఒప్పందం కుదిరింది. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ భాష మారాలి. టీపీసీసీ చీఫ్ రేవంత్ ను ఎన్నికల ప్రచారం నుంచి తొలగించాలి.

- కాంగ్రెస్ పార్టీ వారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీకి చూపించిన ప్రకటనలు ఒకటి.. బయట ప్రచారానికి వినియోగిస్తున్నవి వేరేగా ఉన్నాయి.

ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులివే..

- జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి అఫిడవిట్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా విషయంలో స్పష్టత లేదన్నది కాంగ్రెస్ ఆరోపణ. దీంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయి.

- యాడ్స్ పై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. సీఆవో ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నాలుగు వీడియోల్ని నిలిపివేయాలని నోటీసులు వచ్చాయి. మేం ప్రచారం చేసే ప్రతి యాడ్ కు అనుమతి తీసుకున్నాం.

- యాడ్స్ ను ఆపటానికి మాకు నేరుగా నోటీసులు ఇవ్వకుండా టీవీ చానళ్లకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు?

- రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది పోలీసులు మా అభ్యర్థులను..కార్యకర్తలపైనా బెదిరింపులకు దిగుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారు.

- మేం ఎంసీఎంసీకి ఇచ్చిన యాడ్స్.. టీవీలకు ఇచ్చిన యాడ్స్ ఒకటే. కావాలంటే.. రెండింటిని ఒకేచోట పెట్టి చూస్తే సరిపోతుంది.

- యాడ్స్ పై టీవీ చానళ్లకు ఇచ్చిన నోటీసులపై ఎన్నికల సంఘం రివ్యూ చేయాలి.