Begin typing your search above and press return to search.

తొలి ‘పొత్తు’.. బీఎస్పీకి ఆ 2 లోక్ సభ సీట్లు.. బీఆర్ఎస్ ప్రకటన

బీఆర్ఎస్ పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను కేటాయించింది.

By:  Tupaki Desk   |   15 March 2024 6:59 AM GMT
తొలి ‘పొత్తు’.. బీఎస్పీకి ఆ 2 లోక్ సభ సీట్లు.. బీఆర్ఎస్ ప్రకటన
X

వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో తొలి పొత్తు పొడిచింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న రాష్ట్రంలో.. ఓ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శించిన బీఎస్పీ లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతోపాటు 2 స్థానాలు దక్కించుకుంది. వీటిలో ఒకచోట గట్టి పోటీ ఇవ్వడమే కాక.. వీలైతే గెలిచేందుకూ చాన్సుంది. మరోచోట మాత్రం అవకాశాలు చాలా స్వల్పం.

నాగర్ కర్నూల్ లో..

బీఆర్ఎస్ పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలను కేటాయించింది. వీటిలో నాగర్ కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన సొంత నియోజకవర్గం అలంపూర్ దీని పరిధిలోకే వస్తుంది. దీంతోపాటు ఎస్సీలకు రిజర్వయిన మరో నియోజకవర్గం అచ్చంపేట కూడా ఉంది. నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వుడ్ లోక్ సభ స్థానం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నెగ్గింది. అయితే, సిటింగ్ ఎంపీగా ఉన్న పి.రాములు బీజేపీలో చేరి తన కుమారుడికి టికెట్ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి సహా పలువురు టికెట్ ఆశిస్తున్నారు.

తొలి పొత్తు..

బీఆర్ఎస్ తెలంగాణలో వచ్చే లోక్ సభ ఎన్నికలకు పొత్తు కుదుర్చుకున్న తొలి పార్టీగా నిలిచింది. కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంటుందో లేదో తెలియదు. బీజేపీతో కలిసొచ్చే పార్టీలు లేవు. మరోవైపు బీఎస్పీకి రెండు సీట్లు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లోనే పోటీ చేస్తున్నట్లు అయింది.