పచ్చ చానెల్ చేష్టలు...బీఆర్ఎస్ కి ఊపు తెచ్చిందా ?
ఉమ్మడి ఏపీలో నుంచే చూస్తే కనుక అనేక చానళ్ళు రాజకీయ పార్టీలుగా విడిపోయాయి. అందులో మెజారిటీ చానళ్ళు అయితే టీడీపీకి అనుకూలంగా మైక్ సవరిస్తూ పోయాయి.
By: Tupaki Desk | 30 Jun 2025 9:00 PM ISTఉమ్మడి ఏపీలో నుంచే చూస్తే కనుక అనేక చానళ్ళు రాజకీయ పార్టీలుగా విడిపోయాయి. అందులో మెజారిటీ చానళ్ళు అయితే టీడీపీకి అనుకూలంగా మైక్ సవరిస్తూ పోయాయి. వాటి అతి పోకడల వల్లనే టీడీపీకి కొన్ని సార్లు చేటు వచ్చిందని కూడా చెబుతారు. ఇక తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమం సాగిన సమయంలో కొన్ని చానళ్ళు తెలంగాణా స్టాండ్ తీసుకున్నాయి. ఇక 2014లో కేసీఆర్ అధికారంలోకి రావడంతో గులాబీ పార్టీకి అనుకూలంగా అనేక చానళ్ళు తమ స్టైల్ రాత్రికి రాత్రే మార్చేశాయి.
అలా మార్చలేని చానళ్ళు సౌండ్ తగ్గించాయి. ఇలా పదేళ్ళ కేసీఆర్ జమానా సాగింది. ఎపుడైతే మళ్ళీ కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చిందో నాటి నుంచే కొన్ని పచ్చ చానళ్ళకు ప్రాణం వచ్చినట్లు అయింది అన్న విశ్లేషణ ఉంది. దాంతో బిగ్ సౌండ్ చేస్తూ వచ్చాయి.
ఈ క్రమంలో సహజంగానే అధికార పార్టీకి వత్తాసు పలకడం ఒక వైపు ఉంటే అది కాస్తా మరింత ఎక్కువై గులాబీ దండుకు యాంటీగా వార్తలు వండి వార్చడం మొదలైంది అని అంటున్నారు. ఇక తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బిగ్ పొలిటికల్ ఇష్యూగా ఉంది. దాంతో బీఆర్ఎస్ కొంత ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే దీని మీద వరుసగా వార్తా కధనాలు వస్తున్నాయి. అవి శృతి మించి పోయాయని బీఆర్ఎస్ అంటోంది. వ్యక్తిత్వ హననానికి కొన్ని చానళ్ళు పాల్పడుతున్నాయని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో ఒక చానల్ మీద దాడి జరగడం దానిని చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఖండించడంతో బీఆర్ఎస్ కి సెంటిమెంట్ ని రగిలించే చాన్స్ వచ్చింది అని అంటున్నారు. వాస్తవంగా చూస్తే బీఆర్ఎస్ కి ఇపుడు తెలంగాణా సెంటిమెంట్ కావాలి. అయితే రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న ఏడాదిన్నర కాలంలో అసలు ఆ చాన్స్ ఇవ్వడం లేదు. దాంతో కిందా మీదా అవుతున్న బీఆర్ఎస్ కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మెడకు గట్టిగానే చుట్టుకుంది అని అంటున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక పచ్చ చానల్ చేసిన వ్యవహారం అతి గా మారి శృతి మించడంతో దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక ఆ చానల్ మీద దాడి జరిగింది. ఇలా దాడి జరిగిందో లేదో అలా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఖండించడమే బీఆర్ఎస్ కి ఎక్కడ లేని ఊపుని తెచ్చింది అని అంటున్నారు.
ఇది కాస్తా వ్యవహారం వేరుగా మారి మళ్ళీ ఏపీ తెలంగాణా పంచాయతీగా మారింది. అయితే ఈ విషయంలో ప్రజలు అయితే పెద్దగా పట్టించుకోవడం లేదనే అంటున్నారు. కానీ బీఆర్ఎస్ కి ఒక కారణం అయితే ఈ విధంగా తెలంగాణా సెంటిమెంట్ ని లేపడానికి దొరికింది కదా అని అంటున్నారు. ఈ దాడి విషయంలో కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం దాడి కంటే ఎక్కువగా తెలంగాణా సెంటిమెంట్ నే ముందుకు తీస్తోంది.
దాడి చేసింది తప్పా రైటా అన్న డిస్కషన్ లోకి పోనీయకుండా తెలంగాణా వాదాన్ని తెర ముందుకు తెస్తోంది. ఎక్కడ కూర్చుని ఎవరి మీద విమర్శలు చేస్తున్నారో ఆలోచించుకోండి అని బీఆర్ఎస్ మాజీ మంత్రులు అంటున్నారు అంటే మళ్ళీ మంట రేపేందుకేనా అన్నది కూడా చర్చగా ఉంది. ఆంధ్రా వారు వచ్చి మా గడ్డ మీద మమ్మల్నే విమర్శిస్తారా అన్నది ఇపుడు బీఆర్ఎస్ నేతల ప్రతి ఆరోపణగా ఉంది.
దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో ఎంతవరకూ సమంజసం అన్న ప్రశ్న ఒక వైపు ఉండగానే బీఆర్ఎస్ నేతలు మాత్రం మా గడ్డ మీదకు వచ్చి మమ్మల్నే విమర్శిస్తారా అన్న కొత్త పాయింట్ తో సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఇక మీదట ఇలాగే బీఆర్ఎస్ నేతల క్యారెక్టర్ మీద విమర్శలు చేస్తే ఊరుకోమని అంటున్నారు. నిరాధారమైన వార్తలతో కధనాలు వండితే ఎలా అని మండిపోతున్నారు. మొత్తానికి ఇష్యూ అయితే ఫ్యోన్ ట్యాపింగ్ అది కాస్తా దాడిగా మారింది. ఇపుడు మీడియా హౌజ్ మీద దాడుల కంటే తెలంగాణా వాదమే ముందుకు తెచ్చి బీఆర్ఎస్ చేస్తున్న రచ్చ రాజకీయంగా ఏ రకమైన ఫలితాలను అందిస్తుందో చూడాల్సిందే అంటున్నారు.
