బీఆర్ ఎస్ సోషల్ మీడియా అంతవరకే పరిమితమా?
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి బలమైన మీడియా ఉంది. ఒకవైపు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా కూడా సొంతంగా ఏర్పాటు చేసుకుంది.
By: Garuda Media | 16 May 2026 5:00 AM ISTతెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీకి బలమైన మీడియా ఉంది. ఒకవైపు ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ప్రింట్ మీడియా కూడా సొంతంగా ఏర్పాటు చేసుకుంది. అయితే.. 2023 ఎన్నికల్లో ఈ మీడియా పార్టీని గట్టెంక్కించలేక పోయింది. అంతేకాదు.. గ్రామీణ ఓటరు నాడిని కూడా పట్టుకోలేక పోయింది. ఫలితం గా నగరాల్లో కొంత మేరకు ఫర్వాలేదని అనిపించినా.. గ్రామీణ స్థాయిలో పార్టీ పరాజయం పాలైంది.
ఇక, వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేయడంతోపాటు.. నాయకులను కూడా ముందుండి నడిపించాలని ఇటీవలే సీనియర్ నాయకులకు పార్టీ సుప్రీం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్రస్తావన కూడా వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియా చాలా యాక్టివ్‌గా ఉందని కేటీఆర్ చెప్పగా.. అదేం లేదని.. హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
సోషల్ మీడియా కేవలం ట్రోల్స్, విమర్శలకే పరిమితం అవుతోందన్నది హరీష్ రావు వాదనగా ఉంది. అలా కాకుండా.. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని.. పట్టుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. దీనిపై ఒకరిద్దరు నాయకులు.. ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామీణ, పట్టణ స్థాయిలో ప్రజల నాడిని పట్టుకునే విషయంలో బీఆర్ ఎస్ సోషల్ మీడియా పెద్దగా వర్కవుట్ చేయడం లేదన్న వాదన వినిపించింది.
ప్రస్తుతం రాజకీయంగా విమర్శలకు.. పోస్టులకు మాత్రమే పరిమితం అవుతోందన్నది ఎక్కువ మందిలో ఉన్న అభిప్రాయం. ఇది ఓటరు నాడిని పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని కూడా చెబుతున్నారు. వాస్తవానికి ప్రధాన మీడియాతో పోల్చుకుంటే సోషల్ మీడియాకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఈ విషయంలో బీఆర్ ఎస్ కూడా భారీ వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ప్రస్తుతం రాజకీయ విమర్శలకు.. పోస్టులకు పరిమితం అయిందని.. ప్రజల నాడిని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురాలేకపోతోందన్న అభిప్రాయం వచ్చింది. దీనిని బలోపేతం చేసూఏందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
