మా వోళ్లు ఓటేయరు: బీఆర్ ఎస్ సంచలన ప్రకటన
ఈ నెల 23న ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ దూరంగా ఉంది.
By: Tupaki Desk | 19 April 2025 4:18 PM ISTహైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఎవరూ కూడా.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన బోరని తెలిపింది. ఈ మేరకు పార్టీ తరఫున ఓటింగుకు ముందు రోజు విప్ జారీ చేయనున్నట్టు వివరించిం ది. దీంతో తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో తటస్థంగా ఉన్నట్టని ప్రకటించింది. ఈ మేరకు తాజాగా.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఈ నెల 23న ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ దూరంగా ఉంది. బీజేపీ, ఎంఐఎంలు మాత్రమే పోటీ పడుతున్నాయి. ఈ విషయంపైనా బీఆర్ ఎస్ క్లారిటీ ఇచ్చింది. తమకు చాలినంత బలం లేనందుకే.. పోటీకి దూరంగా ఉన్నామని స్పష్టం చేసింది. అదేసమయంలో వేరే పార్టీకి మద్దతు ఇవ్వబోమని.. అందుకే ఓటింగుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని ప్రకటిం చింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంల సభ్యులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొననున్నారు.
ఇదిలావుంటే.. ఎంఐఎంతో పోల్చుకుంటే.. బీజేపీకి సభ్యుల కొరత ఉంది. ఎంఐఎంకు 49 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా పోలింగ్‌లో పాల్గొనే అవకా శం ఉంది. మొత్తంగా ఈ సీటు విషయంలో బీజేపీ చేస్తున్న పోరాటం కేవలం నామమాత్రంగానే మిగిలి పోనుంది. మరోవైపు.. ముందుగానే కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం సహకరించిం ది. ఈ క్రమంలో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లు.. ఎంఐఎంకు అనుకూలంగా ఓటేసే అవకాశం ఉంది. ఫలితంగా ఎంఐఎం విజయం తధ్యమని అంటున్నారు.
