Begin typing your search above and press return to search.

హరీష్ మాస్ ఫాలోయింగ్...బీఆర్ఎస్ లో కొత్త చర్చ !

పార్టీ కోసం ఆయన చాలానే కష్టపడ్డారు అని అంటున్నారు. ఇక ఉద్యమకాలంలో హరీష్ రావు మెరిపించిన మెరుపులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   29 May 2025 6:00 AM IST
హరీష్ మాస్ ఫాలోయింగ్...బీఆర్ఎస్ లో కొత్త చర్చ !
X

గులాబీ పార్టీలో ఇపుడు సరికొత్త చర్చ సాగుతోంది. పార్టీ ఫ్యూచర్ ఏమవుతుంది అన్నదే ఆ చర్చ. బీఆర్ఎస్ లో వారసత్వం పోరు పీక్స్ కి చేరుకున్న వేళ ఎవరు పార్టీని లీడ్ చేయగలరు అన్న దాని మీద భిన్నాభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ లాంటి వ్యూహ చతురత నైపుణ్యం ప్రావీణ్యం అన్నీ ఉన్న నాయకుడి విషయంలో వారసుడు కూడా అలాగే ఉండాలని క్యాడర్ కోరుకుంటుంది.

కేటీఆర్ విషయానికి వస్తే ఆయన తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కేటీఆర్ కి క్లాస్ ఇమేజ్ ఎక్కువ. ఆయన మాస్ అప్పీల్ కోసం ఎంతగా ట్రై చేస్తున్నా కుదరడం లేదు. అదే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు విషయానికి వస్తే ఆయనకు బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉందని అంటున్నారు.

ఆయన కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసినా పార్టీలో కీలక నేతగా ఉన్నా ఆయన కంటే కేటీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నది తెలిసిందే. తన వర్గం వారికి ఎలాంటి పదవులు ఆయన పార్టీలో ఇప్పించుకోలేకపోయారు. ఇక కేటీఅర్ వారసుడు అన్నది ఎప్పటికపుడు ప్రొజెక్ట్ అవుతున్న నేపధ్యం ఉంది. దాంతో హరీష్ రావు హవా పార్టీలో తగ్గుతున్నా జనంలో మాత్రం ఆయన మాస్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు అని అంటున్నారు.

ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు విపరీతంగా వస్తునారు. హరీష్ రావు ఎక్కువగా జిల్లాల టూర్లు చేస్తూంటారు. ప్రజలతో మమేకం అవుతూంటారు. పార్టీలో సైతం హరీష్ రావు నాయకత్వం మీదనే ఎక్కువ మంది నమ్మకం చూపిస్తున్నారు అని అంటున్నారు. హరీష్ రావు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నారు. మేనమామ కం అధినేత అయిన కేసీఆర్ వెంటనే ఉన్నారు.

పార్టీ కోసం ఆయన చాలానే కష్టపడ్డారు అని అంటున్నారు. ఇక ఉద్యమకాలంలో హరీష్ రావు మెరిపించిన మెరుపులు ఎన్నో ఉన్నాయని అంటున్నారు. కేసీఆర్ మార్క్ పంచులు కానీ సెటైర్లు కానీ మళ్లీ వినాలి అంటే కనుక హరీష్ రావు నుంచే అని కూడా అంటున్నారు. ఒక వైపు పార్టీలో కవితా వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా వారసత్వ పోరు సాగుతోంది.

అయితే మధ్యలో హరీష్ రావుకు ఆదరణ బాగా పెరుగుతోంది అని అంటున్నారు. హరీష్ రావు ఎక్కడికి వెళ్ళినా జనాలు పెద్ద ఎత్తున రావడం కూడా జనాంలో ఆయనకు మద్దతు పెరుగుతోంది అని చెప్పడానికి అంటున్నారు. హరీష్ రావు కార్యకర్తలకు అండగా ఉంటున్నారని అంటున్నారు అంతే కాదు అసెంబ్లీ లోపలా కానీ బయట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సెటైర్లు వేయాలన్నా సర్కార్ మీద తీవ్రంగా విరుచుకు పడాలన్నా కూడా హరీష్ రావు లెక్కే వేరుగా ఉంటుందని అంటున్నారు.

ఇక ఆయన కేసీఅర్ నాయకత్వాన్ని ఏ దశలోనూ ఎదిరించలేదు అని గుర్తు చేస్తున్నారు. ఆయన తరచూ ఫాం హౌస్ కి వెళ్ళి మరీ ప్రతీ విషయాన్ని పెద్దాయనతో చర్చిస్తూ వస్తున్నారు. ఆయన సలహా సూచనలు తీసుకుంటున్నారు. ఒక విధంగా పార్టీలో నిబద్ధతతో పనిచేసే నేతగా ఉంటూనే కాంగ్రెస్ కి అసలైన ప్రతిపక్షంగా కూడా కనిపిస్తున్నారు దానితో ఆయన మీదనే ఇపుడు బీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది. హరీష్ రావు మాస్ ఇమేజ్ పార్టీకి అతి పెద్ద అసెట్ అంటున్నారు. మరి రేపటి రోజున వారసత్వ పోరులో హరీష్ రావు పాత్ర ఏమిటి ఆయనను ఏ స్థానంలో అధినాయకుడు నిలబెడతారు అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు.