Begin typing your search above and press return to search.

మహా కక్కుర్తి.. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు

కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ గా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఫ్రీగా వచ్చే డబ్బుల కోసం తప్పుడు పనులు చేస్తుంటారు కొందరు

By:  Tupaki Desk   |   19 March 2024 4:25 AM GMT
మహా కక్కుర్తి.. అన్నా చెల్లెలు పెళ్లి చేసుకున్నారు
X

కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్ గా ఈ ఉదంతాన్ని చెప్పాలి. ఫ్రీగా వచ్చే డబ్బుల కోసం తప్పుడు పనులు చేస్తుంటారు కొందరు. అయితే.. అంతో ఇంతో ధర్మాన్ని పాటిస్తారు. కానీ.. తాజా ఉదంతంలో మాత్రం ఇదేమీ పట్టకుండా కేవలం బరితెగింపు మాత్రమే తప్పించి.. మరింకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరించిన వైనాన్ని చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. అదే సమయంలో ఇద్దరి చేష్ట యూపీ ముఖ్యమంత్రి యోగి లాంటి బలమైన అధినేతకు తెగ ఇబ్బందిగా మారటం మరో కీలకాంశంగా చెప్పొచ్చు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి సాముహిక వివాహ పథకం కింద కొన్నిప్రోత్సాహకాలను అందిస్తారు. తాజాగా ఇద్దరు అన్నాచెల్లెళ్లు ప్రభుత్వం ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు. సీఎం చేసే సామూహిక వివాహ పథకానికి అప్లై చేసుకున్నారు. అనంతరం వారిద్దరి పెళ్లాడారు. అయితే.. ఇదంతా కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కోసమే.

యూపీలోని మహారాజ్ గంజ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల ఐదో తేదీన ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం సామూహిక పెళ్లిళ్లు చేయగా.. అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక మొత్తం కోసమే. అయితే.. ఆమెకు ఏడాది క్రితమే వేరే వ్యక్తితో పెళ్లైంది. జీవనోపాధి కోసం భర్త వేరే ప్రాంతంలో ఉండగా.. సర్కారు పైసలు కోసం కక్కుర్తి పడి అన్నతో కలిసి పెళ్లి పీటల మీద కూర్చున్న వైనం గురించి భర్తకు తెలిసి షాక్ తిన్నాడు.

దీంతో.. వీరి భాగోతం గురించి సదరు భర్త అధికారులకు కంప్లైంట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. కీలకమైన ఎన్నికల వేళ.. వెలుగు చూసిన ఈ ఉదంతం ద్వారా యోగి ప్రభుత్వ సమర్థతపై కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ కార్యక్రమానికి లబ్ధిదారులుగా వచ్చే వారి గురించి సరిగా ఆరా తీయరా? ఇది ప్రభుత్వ వైఫల్యం కూడా కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో.. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిన చందంగా.. అన్నాచెల్లెలు చేసిన ఘనకార్యం యోగి సర్కారుకు ఇబ్బందికరంగా మారింది.