Begin typing your search above and press return to search.

బ్రిటీష్ పౌరుడిగా అకాయ్.. రూల్స్ ఏమంటున్నాయ్?

అయితే.. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ కొట్టేస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... విరాట్ కొడుకు అకాయ్ లండన్ లో జన్మించాడు

By:  Tupaki Desk   |   22 Feb 2024 6:01 AM GMT
బ్రిటీష్  పౌరుడిగా అకాయ్.. రూల్స్  ఏమంటున్నాయ్?
X

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. రెండోసారి తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇటీవల జన్మించిన ఆ బాబుకు "అకాయ్" అని నామకరణం చేసినట్లు అనుష్క శర్మ ఆన్ లైన్ వేదికగా వెల్లడించారు. వామికా తమ్ముడు అకాయ్ ఈ లోకంలోకి అడుగుపెట్టాడంటూ విరాట్, అనుష్క సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రెటీలు, తోటి క్రీడాకారులు, అభిమానుల నుంచి కొహ్లీ దంపతులకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.

అవును... విరాట్‌ కోహ్లి భార్య అనుష్క లండన్‌ లోని ఓ ఆస్పత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ కొట్టేస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... విరాట్ కొడుకు అకాయ్ లండన్ లో జన్మించాడు కాబట్టి.. అతడు ఇండియన్ అవుతాడా.. లేక, బ్రిటీష్ పౌరుడా? అని! ఈ సమయంలో లండన్ లో జన్మించిన బిడ్డలకు అక్కడి పౌరసత్వంపై రూల్స్ ఏమి చెబుతున్నాయనేది ఇప్పుడు చూద్దాం..!

యూకేలోని నిబంధనల ప్రకారం... ఒక బిడ్డ అక్కడ పుట్టినంత మాత్రాన్న అతన్ని బ్రిటిష్ పౌరుడిగా గుర్తించరు! అతని తల్లిదండ్రులలో ఒకరికైనా బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నా.. లేక, ఎక్కువ కాలం అక్కడ నివసించడం, స్థిరపడటం చేసిన వాళ్లకు మాత్రమే బ్రిటిష్ పౌరసత్వం పొందగలరని చెబుతున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే... కొహ్లీ వారసుడు బ్రిటీష్ పౌరుడు కాదు!

ఇదే సమయంలో... ఒక వేళ తల్లిదండ్రులు బ్రిటిష్ పౌరులు అయ్యి, ఆ బిడ్డ యూకే వెలుపల జన్మించినట్లయితే.. అతను బ్రిటిష్ పౌరుడు అవుతాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క లండన్‌ లో ఇల్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ వారికి ఒక ఇల్లు ఉన్నప్పటికీ... అకాయ్ బ్రిటిష్ పౌరుడు కాలేడు. కాకపోతే అకాయ్ పాస్‌ పోర్ట్ యూకే అందిస్తుంది. అతన్ని మాత్రం భారతీయ పౌరుడు అనే పిలుస్తారు.

కాగా... విరాట్ కోహ్లి కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలుత మొదటి రెండు టెస్ట్ లకు దూరంగా ఉంటాడని కథనాలొచ్చినా... అనంతరం మూడో టెస్టు నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే... డెలివరీ సమయంలో తన భార్య అనుష్క తో గడపడం కోసమే కొహ్లీ సెలవు తీసుకున్నాడు!