Begin typing your search above and press return to search.

పో*ర్న్ వ్యసనం.. 'నాపై నాకే అసహ్యం వేసింది.. యోగాతో బయటపడ్డా' – ఒక యువతి ఆవేదన

ఈ డిజిటల్ యుగంలో సమాచారం ఎంత వేగంగా అందుబాటులోకి వస్తుందో కొన్ని ప్రమాదకరమైన విషయాలు కూడా అంతే సులభంగా యువతను ప్రభావితం చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 Jun 2025 11:00 PM IST
పో*ర్న్ వ్యసనం.. నాపై నాకే అసహ్యం వేసింది.. యోగాతో బయటపడ్డా – ఒక యువతి ఆవేదన
X

ఈ డిజిటల్ యుగంలో సమాచారం ఎంత వేగంగా అందుబాటులోకి వస్తుందో కొన్ని ప్రమాదకరమైన విషయాలు కూడా అంతే సులభంగా యువతను ప్రభావితం చేస్తున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి పో*ర్నోగ్రఫీ. సరదాగానో, ఉత్సాహంతోనో చూడడం మొదలుపెట్టిన పో*ర్న్ వీడియోలు (Porn Videos) ఎలా వ్యసనంగా మారి, వ్యక్తిగత జీవితాలపై, ముఖ్యంగా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అలాంటి ఒక భయానక అనుభవాన్ని ఎదుర్కొని, దాని నుంచి ఎలా బయటపడిందో ఓ యువతి చెప్పుకొచ్చింది.

బ్రిటన్‌కు చెందిన నిక్కీ బ్రయాంట్ అనే యువతి, విపరీతంగా పో*ర్న్ వీడియోలు చూడడం వల్ల సె*క్స్ అంటేనే విరక్తి చెందారు. తాను సె*క్స్ విషయంలో అసమర్ధురాలినని, తన శరీరం మలినం అయిపోయిందన్న భావనలోకి వెళ్లిపోయారు. నిక్కీ తన ఎదుగుతున్న సమయంలో సె*క్స్ గురించి తనకు ఎవరూ సరిగా వివరించి చెప్పలేదని తెలిపారు. దాని చుట్టూ ఆవరించిన సిగ్గు, బిడియం లాంటివే దీనికి ప్రధాన కారణం కావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

11 సంవత్సరాల వయసులో ఒక సోషల్ మీడియా సైట్‌లో నిక్కీ మొదటిసారి పో*ర్న్ వీడియో చూశారట. అది ఆమెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. "అందులో ఒక మహిళ ఉంటుంది. ఆమె అవతలి వ్యక్తి వశమై, పెద్దగా శబ్దాలు చేస్తూ చాలా అసహ్యకరమైన రీతిలో కనిపిస్తుంది" అని నిక్కీ గుర్తు చేసుకున్నారు. "నేను కూడా ఆ దృశ్యాలను అనుకరించడానికి ప్రయత్నించే దానిని. ఎందుకంటే అలా చేయడం కరెక్టనీ, మగవాళ్లు దాన్ని ఇష్టపడతారని అనుకునేదాన్ని" అంటూ తను ఆవేదన వ్యక్తం చేశారు.

తరచూ పో*ర్న్ చిత్రాలు చూడడం వల్ల తన శరీరం అందరిలా లేదని, ఏదో లోపం ఉందని నిక్కీ భావించడం మొదలుపెట్టారు. చివరికి ఆమె తన జననావయవాలకు ఆపరేషన్ చేయించుకునే వరకు వెళ్లారట. చివరకు ఇదంతా చాలా అసహ్యకరమైన వ్యవహారంలా అనిపించడంతో ఈ పో*ర్న్ ఆలోచనల నుంచి బయటపడాలని నిక్కీ నిర్ణయించుకున్నారు. దీని కోసం ఆమె యోగా, ధ్యానం లాంటి వాటి సాయం తీసుకున్నారు.

నిక్కీ లాంటి అనుభవాలు చాలా మంది యువతలో ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ 2020లో ఒక నివేదికను రూపొందించింది. పిల్లలు, యువత పోర్న్ వీడియోలపై వ్యామోహంలో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాల్సిందిగా ఈ కమిటీని ప్రభుత్వం కోరింది.

ఈ కమిటీ 11-17 సంవత్సరాల వయసున్న 1,100 మంది పిల్లలతో మాట్లాడింది. వారిలో 16 సంవత్సరాల వయసు దాటి, సె*క్సువల్‌గా చురుకుగా ఉన్నవారిలో 18శాతం మంది తమను పో*ర్న్ వీడియోలను అనుకరించాల్సిందిగా భాగస్వాములు కోరారని, అలాగే చేశామని చెప్పారు. 16 సంవత్సరాల వయసు దాటిన వారిలో 30శాతం మంది, నిజమైన సె*క్స్ పో*ర్న్ వీడియోలలో చూపించినట్లుగా లేదని తేల్చారు. 37శాతం మంది ఏమీ చెప్పలేమని చెప్పారు. పోర్న్ వీడియోలలో చూపించిన వ్యక్తుల శరీరాలను చూశాక తమ శరీరాలపై అసహ్యం వేసిందని 11-17 సంవత్సరాల వయసు మధ్య ఉన్న యువతలో 29శాతం మంది చెప్పారు.