Begin typing your search above and press return to search.

ఇకపై అక్కడ స్కూళ్లలో సెల్‌ ఫోన్ల వినియోగంపై నిషేధం!

ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ కు ఏ స్థాయిలో ఎడిక్ట్ అవుతున్నారనేది చాలా మందికి తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   21 Feb 2024 11:30 PM GMT
ఇకపై అక్కడ స్కూళ్లలో సెల్‌ ఫోన్ల వినియోగంపై నిషేధం!
X

ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ కు ఏ స్థాయిలో ఎడిక్ట్ అవుతున్నారనేది చాలా మందికి తెలిసిన విషయమే. ఈ విషయంలో చాలా మంది పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే... మరికొతమంది మాత్రం తమపనులు తాము చేసుకోవడం కోసం పిల్లలకు సెల్ ఫోన్ లు ఇచ్చి బానిసలుగా చేస్తున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి.

పైగా కాస్త ఊహ వచ్చిన చాలా మంది పిల్లలు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కి అలవాటు కాదు బానిసలుగా మారుతున్నారనే చర్చ కూడా తెరపైకి వస్తుంది. దీనివల్ల వారిలో సృజనాత్మకత సన్నగిల్లడంతోపాటు.. శారీరక శ్రమకు కూడా దూరమవుతున్నారని.. గేములన్నీ సెల్ ఫోన్ లోనే ఆడటంతో మైదానంలో ఆటలపై ఆసక్తి తగ్గిపోతుందని అంటున్నారు.

దీనివల్ల పిల్లలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని.. వారి చదువు పక్కదోవ పడుతుందని.. ఇదే సమయంలో ఆన్ లైన్ మోసాల బారిన కూడా పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై అన్ని పాఠశాలల ప్రాంగణంలోనూ సెల్ ఫోన్ వినియోగం లేదని తెలిపింది.

అవును... బ్రిటన్‌ లోని అన్ని స్కూల్ క్యాంపస్ లలోనూ సెల్‌ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని అక్కడి ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాలపై స్పందిస్తూ... 12 ఏళ్ల వయసు నాటికే సుమారు 97 శాతం మంది పిల్లలు మొబైల్‌ ఫోన్‌ లు కలిగి ఉన్నారని చెబుతున్నారు. ఫలితంగా... పిల్లలు పక్కదోవ పట్టడం.. తద్వారా చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని పేర్కొంటున్నారు.

ఇలా 12ఏళ్ల వయసుకే సుమారు 97శాతం మంది పిల్లలు సెల్ ఫోన్ ను కలిగి ఉండటంతో వీరి చదువు పక్కకు వెళ్లడంతోపాటు ఆన్ లైన్ మోసాల బారినా పడుతున్నారు. ఇదే సమయంలో తీవ్ర ఒత్తిడికీ గురవుతున్నారని అంటున్నారు. దీంతో తమ దేశంలోని అన్ని స్కూల్స్ లోనూ సెల్ ఫోన్ ని నిషేదిస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.