Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ తోనే ఊపేసిన న‌యా మేక‌ర్స్!

ఒక్క హిట్ ఉంటే చాలు. స్టార్ హీరోలు మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇస్తున్నారు. సినిమా ప‌ట్టాలెక్కడం ఆల‌స్య‌మ‌వ్వొచ్చు గానీ..తెలివిగా ముందుగా ఆ డైరెక్ట‌ర్ల‌ను లాక్ చేసి పెడుతున్నారు

By:  Tupaki Desk   |   15 May 2025 9:45 AM
ఒక్క హిట్ తోనే ఊపేసిన న‌యా మేక‌ర్స్!
X

ఒక్క హిట్ ఉంటే చాలు. స్టార్ హీరోలు మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇస్తున్నారు. సినిమా ప‌ట్టాలెక్కడం ఆల‌స్య‌మ‌వ్వొచ్చు గానీ..తెలివిగా ముందుగా ఆ డైరెక్ట‌ర్ల‌ను లాక్ చేసి పెడుతున్నారు. అలాంటి డైరెక్ట‌ర్లు ప్ర‌స్తుతం న‌లుగురైదుగురు లైన్ లో ఉన్నారు. `హాయ్ నాన్న‌`తో నానికి క్లాస్ హిట్ అందించాడు శౌర్యువ్. క‌మ‌ర్శియ‌ల్ గా అనుకున్న రేంజ్ లో స‌క్స‌స్ అవ్వ‌న‌ప్ప‌టికీ ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ కి బాగా న‌చ్చిన చిత్రంగా తేలింది.

శ్యూర్యువ్ ట్యాలెంట్ కి మంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దీంతో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న‌తో సినిమా చేస్తాన‌ని అప్ప‌ట్లో ప్రామిస్ చేసాడు. తాజాగా త‌న త‌దుప‌రి చిత్రాల లైన‌ప్ లో శౌర్యువ్ కూడా చేరాడు. `కింగ‌డమ్` రిలీజ్ అనంత‌రం రాహుల్ సంకృత్య‌న్ తో పాటు మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా ఉంది. వీళ్లిద్ద‌రి స‌ర‌స‌న తాజాగా శౌర్యువ్ కూడా చేరాడు. అలాగే `కోర్టు` విజ‌యంతో యంగ్ మేక‌ర్ రామ్ జ‌గ‌దీష్ పేరు ఇండ‌స్ట్రీలో మారు మ్రోగుతుంది.

త‌క్కువ బ‌డ్జెట్ లో నే భారీ లాభాలు తెచ్చిపెట్టాడు. దీంతో రామ్ ల‌క్ష‌ణ్ తో నేరుగా నానినే సినిమా చేయా లని ప్లాన్ చేస్తున్నాడు. నానికంటే ముందే దుల్క‌ర్ స‌ల్మాన్ పిలిచి అవ‌కాశం ఇచ్చాడు. ముందుగా దుల్క ర్ తోనే ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. మ‌రికొంత మంది నిర్మాత‌లు త‌మ బ్యాన‌ర్లో చేయా ల్సిందిగా అడ్వాన్స్ లు చెల్లించారు. `ద‌స‌రా` హిట్ తో లైన్ లోకి వ‌చ్చిన శ్రీకాంత్ ఓదెలకు ఏకంగా మెగాస్టార్ చిరంజీ వినే డైరెక్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.

`ద‌స‌రా` హిట్ చూసి చిరంజీవి పిలిచి అవ‌కాశం ఇచ్చారు. అదే హిట్తో నాని అదే ద‌ర్శ‌కుడితో `ది ప్యార డైజ్` చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే క మేక‌ర్స్ సుజిత్ -సందీప్ ల‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తు న్నాయి. టైర్ 2 హీరోలు కొంద‌రు మంచి క‌థ తో అప్రోచ్ అవ్వ‌మ‌ని అవ‌కాశాలు క‌ల్పిస్తున్నారు. నిర్మాత లైతే త‌మ బ్యాన‌ర్లో చేయాల్సిందిగా అడ్వాన్సులు చెల్లిస్తున్నారు.