Begin typing your search above and press return to search.

హాట్ ఎయిర్ బెలూన్ హర్రర్.. ఎనిమిది మంది మృతి.. వీడియో వైరల్!

బ్రెజిల్ దక్షిణ రాష్ట్రమైన శాంటా కేథరినాలో శనివారం 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయింది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 9:26 AM IST
హాట్  ఎయిర్  బెలూన్  హర్రర్.. ఎనిమిది మంది మృతి.. వీడియో వైరల్!
X

బ్రెజిల్ దక్షిణ రాష్ట్రమైన శాంటా కేథరినాలో శనివారం 21 మంది ప్రయాణికులతో వెళ్తున్న హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు ఎనిమిది మంది మరణించారని అధికారులు తెలిపారు. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో టూరిజం బెలూన్ మంటల్లో చిక్కుకుని ప్రియా గ్రాండే నగరంలో కూలిపోయిందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ తెలిపింది.

అవును... బ్రెజిల్‌ గగనతలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా.. గాల్లో ఉన్న ఓ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ లో మంటలు చెలరేగి, అది అమాంతం కిందపడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ గా మారాయి.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... బ్రెజిల్‌ లోని శాంటా కేథరినాలో ఓ హాట్‌ ఎయిర్‌ బెలూన్‌.. ప్రయాణికులతో కలిసి గాల్లోకి ఎగిరింది. ఆ సమయంలో ఆ బెలూన్ లో పైలట్‌ సహా 21 మంది ఉన్నారు. ఈ క్రమంలో.. గాల్లోకి ఎగిరిన కాసేపటికే హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే అవి విపరీతంగా వ్యాపించాయి.

దీంతో.. ఆ మంటలకు కాలిపోయిన ఆ బెలూన్‌ కిందికి పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 13 మందికి గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించి, వైద్య సహాయం అందిస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన స్థానిక గవర్నర్ జోర్గిన్హో మెల్లో... ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సహాయక బృందాలు రంగంలోకి దిగాయని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఘటనలో గాయపడినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అంటున్నారు.