బ్రాహ్మణులకు పొలిటికల్ రిజర్వేషన్: ఏపీ మాటేంటి.. ?
అంతేకాదు.. కొందరు సంఘాలుగా ఏర్పడి.. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
By: Garuda Media | 9 Feb 2026 9:28 AM ISTరాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉన్నట్టుగానే.. ఇప్పుడు కొత్తగా బ్రాహ్మణులకు.. కూడా రిజ ర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ తెరమీదికి వచ్చింది. ఇదేమీ ఏపీలోనో.. తెలంగాణలోనో పుట్టిన డిమాండ్ కాదు. సాక్షాత్తూ.. యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో జనించిన డిమాండ్. దీనిపై పెద్ద ఎత్తున బ్రాహ్మణులు యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీలలో ఉద్యమాలు కూడా చేస్తున్నారు.
అంతేకాదు.. కొందరు సంఘాలుగా ఏర్పడి.. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై విచారిస్తామని చెప్పిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం ఒపీనియన్‌ను కోరింది. అంతేకాదు.. బ్రాహ్మణులకు ఇప్పుడు అందుతున్న సౌకర్యాలపై నివేదికలు కూడా ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. ఇది కేంద్రంతోనే పోయే సమస్య కాదు.
ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం కూడా తీసుకుని చెబుతామని.. సొలిసిటర్ జనరల్ సుప్రీంకో ర్టుకు చెప్పారు. దీంతో సుప్రీంకోర్టులోఉన్న ప్రస్తుతం పిటిషన్‌పై కేంద్ర న్యాయశాఖ, హోం శాఖలు కసరత్తు ప్రారంభించాయి. ఇక, బ్రాహ్మణులు ఎందుకు పట్టుబడుతున్నారన్నది కీలకంగా మారింది. ఒకప్పుడు అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ, రాను రాను ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్ పెరిగింది.
ఇదే సమయంలో దేశంలో బ్రాహ్మణుల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఈ పరిణామాల క్రమంలోనే.. తమకు ఎక్కడా రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదని.. జాతీయ బ్రాహ్మణ సమాఖ్య గత ఎన్నికల సమయం లోనే ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో బీజేపీ యూపీ సహా.. పలు రాష్ట్రాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి 5-10 టికెట్లు ఇచ్చింది. ఈ వ్యవహారంపై అక్కసుతో ఉన్న బ్రాహ్మణులు రాజ్యాంగబద్ధంగానే తమకు రిజర్వేషన్ కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను ఈ నెల ఆఖరులోగా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంద ని తెలిసింది. దీని ప్రకారం.. ఏపీలో ఏం చేస్తారు? అనేది కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఏపీలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కొందరికి టికెట్లు ఇచ్చారు. కానీ, ఇప్పుడు అధికారికంగా రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది చూడాలి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. అటు వైసీపీ కూడా దీనిపై స్పందించాల్సి ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. 5-8 శాతం రిజర్వేషన్ బ్రాహ్మణులకు కేటాయించాల్సి ఉంటుందని తెలుస్తోంది.
