Begin typing your search above and press return to search.

8 ఏళ్ల దేవాన్ష్‌ కి కూడా తెలుస్తుంది... బ్రాహ్మణి ఫైర్!

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:08 AM GMT
8 ఏళ్ల దేవాన్ష్‌  కి కూడా తెలుస్తుంది... బ్రాహ్మణి ఫైర్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు కోసం రాజమండ్రిలో క్యాండిల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. కొవ్వొత్తులు చేతపట్టి నడిచారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు సంఘీభావంగా జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడారు. చంద్రబాబు అరెస్ట్ చాలా అన్యాయం అని, ఆయన కుటుంబసభ్యురాలిగా కాకుండా ఒక యువతిగా తాను ఈ విషయంపై చాలా బాధపడుతున్నానని అన్నారు.

ప్రజల కోసం నిత్యం పోరాడే సీనియర్‌ నాయకుడి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యులెలా బతుకుతారని ప్రశ్నించిన బ్రాహ్మణి... దేశ ప్రజాస్వామానికి ఇవి చీకటి రోజులని తెలిపారు. లోకేష్ ను రేపోమాపో అరెస్టు చేయొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని తెలిపిన బ్రాహ్మణి... వచ్చే వారంలో తప్పకుండా చంద్రబాబు నిర్దోషిగా బయటకొస్తారనే నమ్మకముందని అన్నారు.

అనంతరం... చంద్రబాబు సభలు, బస్సుయాత్రలు, లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తీరును గమనించిన ప్రభుత్వం ఆధారాల్లేకుండా కేసు పెట్టిందని.. రిమాండ్‌ రిపోర్టు దేవాన్ష్‌ చదివినా ఇందులో ఆధారం ఎక్కడుందని అడుగుతాడని బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తప్పు చేశారని తెలుగు ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు.. లోకేష్ ఢిల్లీ వెళ్లారు.. నేను విజయవాడ-రాజమండ్రి మధ్య తిరుగుతూ ఉన్నాను.. దేవాన్ష్ హైదరాబాద్‌ లో ఒంటరిగా ఉన్నాడు.. అరెస్ట్ మాకు చాలా ఇబ్బంది కలిగించింది.. అయినా మేము పోరాడతాము.. త్వరలో చంద్రబాబు క్లీన్ చిట్‌ తో విడుదల అవుతారు అని అన్నారు.