Begin typing your search above and press return to search.

బొత్స ఇంట గెలిచి రచ్చ గెలవాలా...!?

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ హై కమాండ్ వద్ద బాగానే నమ్మకం సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:53 AM GMT
బొత్స ఇంట గెలిచి రచ్చ గెలవాలా...!?
X

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ హై కమాండ్ వద్ద బాగానే నమ్మకం సంపాదించుకున్నారు. ఒక విధంగా చూస్తే ఆయన ట్రబుల్ షూటర్ పాత్రలో వైసీపీలో ఉన్నారు. ఉద్యోగ కార్మిల సంఘాల విషయంలో ఏ సమ్మె జరిగినా పరిష్కారం చూపే కమిటీలో బొత్స తప్పనిసరిగా ఉంటున్నారు.

అలాగే బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన బొత్స వైసీపీ విడతల వారీ ఇంచార్జిల జాబితాను తానే రిలీజ్ చేస్తూ పార్టీలో కీలకంగా ఉన్నారు. అందుకే వైసీపీలో ఎవరికీ దక్కని చోటు ఆయనకే అని అంటున్నారు.

వైసీపీలో ఒకరికి ఒక్కటే టికెట్ అన్న ఫార్ములాను అమలు చేస్తున్నారు. కానీ బొత్స విషయంలో మాత్రం ఫ్యామిలీ ప్యాకేజ్ అమలు అవుతోంది. ఆయన ఉంటే ఉత్తరాంధ్రలో వైసీపీకి తిరుగులేదు అన్న నమ్మకంతోనే ఇలా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే బొత్సతో పాటు ఆయన తమ్ముడు, భార్య ఇతర కుటుంబీకులు సన్నిహితులకు టికెట్లు ఈసారి కూడా బాగానే దక్కాయి. ఇక బొత్స సతీమణిని విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయిస్తున్నారు. బొత్స మేనల్లుడికి విజయనగరం ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఆ విధంగా రెండు ఎంపీ టికెట్లు ఒకే ఫ్యామిలీకి దక్కుతున్నాయి అన్న మాట.

ఇపుడు బొత్సకు అసలైన సవాల్ ఉందని అంటున్నారు. టికెట్లు అయితే తెచ్చుకుంటున్నారు కానీ గెలుపు సాధించాల్సి ఉంది కదా అని అంటున్నారు. విశాఖలో చూస్తే వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు. బొత్స ఉత్తరాంధ్రా లీడర్ గా ఎంతలా చూస్తున్నా ఆయనను విజయనగరానికే పరిమితం చేయాలని కోరుతున్న వారు సొంత పార్టీలోనే ఉన్నారు అని అంటున్నారు.

బొత్స రాజకీయ కార్యకలాపాలు విశాఖలో కూడా విస్తరిస్తే తట్టుకోలేమని కూడా వైసీపీలో వినిపిస్తోంది అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే అనకాపల్లి ఎంపీ టికెట్ ని తన సతీమణికి బొత్స కోరారు అని వార్తలు వచ్చాయి. కానీ కుదరలేదు. నాడు కానిది నేడు విశాఖ వంటి ఎంపీ టికెట్ నే సాధించి బొత్స తన సత్తా చాటుకున్నారు అని అంటున్నారు.

అయితే బొత్స సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికి టికెట్ రావడం కాదు ఆమెను గెలిపించుకోవాల్సి ఉందని అంటున్నారు. ఆమె గెలుపునకు సొంత పార్టీ వారు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని ఆ విధంగా బొత్స అంతా సానుకూలం చేసుకోవాలి అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ వచ్చి చేరితే ఇంకా పటిష్టం అవుతుంది.

దాంతో విశాఖలో గెలిచేందుకు కూటమిని ధీటుగా ఎదుర్కొంటూనే సొంత పార్టీలో అందరి మద్దతు కూడా సంపాదించాల్సి ఉందని అంటున్నారు. మరి రాజకీయాల్లో తనదైన వ్యూహాలతో ముందుకు సాగే బొత్స విశాఖ ఎంపీ సీటుని గెలిపించుకునే విషయంలో ఏమి చేస్తారో అన్నది చూడాలి ఉంది మరి.