Begin typing your search above and press return to search.

వయాగ్రా అందుకే కాదు... చాలా ఉపయోగాలున్నాయంట!

అవును... వయాగ్రా అంటే సాధారణంగా అంగస్థంభన సమస్య ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుందని అంటారు.

By:  Tupaki Desk   |   25 March 2024 6:00 AM GMT
వయాగ్రా అందుకే కాదు... చాలా ఉపయోగాలున్నాయంట!
X

వయాగ్రా టాబ్లెట్ గురించి చాలామందికి పెద్దగా పరిచయం చేయనక్కరలేదు! సాధారణంగా పురుషుల్లో సె*క్స్ కోరికలను పెంచెందుకు ఉపయోగించే ఔషధంగానే ఇది అందరికీ తెలుసు. ప్రధానంగా.. అంగస్థంభన సమస్యలు ఉనవారికి ఇది అద్భుతమైన వరం అనే చెప్పొచ్చు! అయితే ఇది కేవలం సె*క్స్ విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో హెల్ప్ అవుతుందని, దీనివల్ల ఎక్కువకాలం జీవించొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు!

అవును... వయాగ్రా అంటే సాధారణంగా అంగస్థంభన సమస్య ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుందని అంటారు. అయితే దీనివల్ల ఎక్కువ కాలం జీవించేందుకు కూడా తోడ్పాటు అందుతుందని నిపుణులు చెబుతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో వయాగ్త్రా అనేది ఒక పీడీఈ5 ఇన్ హ్హిబిటర్ గా పనిచేస్తుందంట. ఇది ఫాస్పోడైటరేస్ 5 అనే ఎంజైం ని అడ్డుకుంటుందని, ఫలిల్తంగా అంగస్థంబన సమస్య్యలు తగ్గడంతో పాటు హైబీపీ సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారని తెలుస్తుంది!

వాస్తవానికి గతంలో గుండె జబ్బులు ఉన్నవారు వయాగ్రా ట్యాబ్లెట్లను తీసుకోకూడదని చెప్పేవారు. కానీ... స్వీడన్ లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో.. గుండె జబ్బులు ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకపోగా, వారి ఆయుర్ధాయం కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. ఇది అంగస్థంభన సమస్యతో పాటు గుండె జబ్బులను కూడా నివారించడంలో సహకరిస్తుందని చెబుతున్నారని అంటున్నారు.

ఇక అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం... 18,500 మంది గుండె జబ్బు, అంగస్థంభన సమస్యలు ఉన్నవారిపై ఈ ప్రయోగం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... 16,500 మంది వయాగ్రా ఉపయోగిస్తుండగా.. 2,000 మంది అల్ప్రోస్టడిల్ అనే ఇంజిక్షన్ రూపంలో అందించే మందును ఉపయోగించారంట. వీరిలో అల్ప్రోస్టడిల్ వాడిన వారితో పోల్చితే వయాగ్రా తీసుకున్న వారు ఎక్కువ కాలం జీవించారని, గుండెజబ్బుల ముప్పు తగ్గిందని తేలినట్లు చెబుతున్నారు.

ఇదే క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... వయాగ్రాలో ఉండే పవర్ పుల్ కెమికల్ సిల్డెనాఫిల్ వల్ల ఎక్కువ కాలం జీవించేలా చేస్తుందని తేలిందని చెబుతున్నారు! ఇది మరణం సంభవించే ప్రమాదాన్ని 15%, అల్జీమర్ రిస్క్ ని 18% తగ్గిస్తుందట. ఈ నేపథ్యంలో దీనిపై మరింత లోతైన అధ్యయనం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారని తెలుస్తుంది! కాగా... వైద్యుల సూచనలతోనే వయాగ్రా ట్యాబ్లెట్లు వాడాలి!!