Begin typing your search above and press return to search.

'నా దగ్గర బాంబు ఉంది.. విమానాన్ని పేల్చేస్తా'.. గాల్లో ప్రయాణికుడి హల్ చల్!

అవును... "అమెరికాకు మరణం, ట్రంప్‌ కు మరణం.. అల్లాహు అక్బర్".. అంటూ ఓ వ్యక్తి విమానం గాల్లో ఉండగా గట్టిగా అరుస్తూ కనిపించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   28 July 2025 11:38 AM IST
నా దగ్గర బాంబు ఉంది.. విమానాన్ని పేల్చేస్తా.. గాల్లో ప్రయాణికుడి హల్ చల్!
X

ఇటీవల విమానాల్లో జరుగుతున్న టెన్షన్ సంగతుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఈ క్రమంలో తాజాగా తన వద్ద బాంబు ఉందని.. దాంతో విమానాన్ని పేల్చేస్తానని ఓ ప్రయాణికుడు కేకలు వేశాడు. ఓ పక్కన విమానం గాల్లో ఉంది.. మరో వైపు తన వద్ద బాంబు ఉందనే కేకలు.. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకకరమైన పరిస్థితి నెలకొంది.

అవును... "అమెరికాకు మరణం, ట్రంప్‌ కు మరణం.. అల్లాహు అక్బర్".. అంటూ ఓ వ్యక్తి విమానం గాల్లో ఉండగా గట్టిగా అరుస్తూ కనిపించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది. యునైటెడ్ కింగ్ డమ్ లోని స్కాట్లాండ్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... లుటన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈజీజెట్‌ విమానం ఆదివారం సాయంత్రం గ్లాస్గోకు బయల్దేరింది. ఈ సమయంలో విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత ఓ ప్రయాణికుడు హల్ చల్ చేశాడు. ఇందులో భాగంగా... తన సీట్లో నుంచి లేచి.. తన దగ్గర బాంబు ఉందంటూ గట్టిగట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టాడు.

ఈ సందర్భంగా... "నా దగ్గర బాంబు ఉంది.. ఈ విమానాన్ని పేల్చేస్తా.. అమెరికాకు చావు.. ట్రంప్‌ కు మరణం" అంటూ అరిచాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా... అప్రమత్తమైన సిబ్బంది అతడిని పట్టుకొని బంధించారు. అనంతరం.. సమీపంలోని ఎయిర్‌ పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేశారు.

ఈ సమయంలో... విమానం ల్యాండ్ అవ్వగానే స్థానిక పోలీసులకు నిందితుడిని అప్పగించారు. అయితే... ఆ ప్రయాణికుడి వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు! ఈ సందర్భంగా స్పందించిన స్కాట్లాండ్ పోలీసులు... ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. స్కాట్లాండ్ పర్యటనలోనే ఉన్న సంగతి తెలిసిందే.